బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2022 (10:15 IST)

నెఫ్ట్ పేరుతో బాదుడు.. ఆర్బీఈ సరికొత్త ప్రతిపాదన

banks
బ్యాంకు ఖాతాదారులకు ఇది నిజంగానే దుర్వార్త. ఆన్‌లైన్‌లో డబ్బులు బదిలీ చేసుకునేవారి నుంచి సర్వీస్ చార్జీలు వసూలు చేయాలని భారత రిజర్వు బ్యాంకు నిర్ణయించింది. ముఖ్యంగా, ఎన్.ఈ.ఎఫ్.టీ ట్రాన్సాక్షన్స్‌కు ఈ చార్జీలను వసూలు చేసే దిశగా చర్యలు చేపట్టింది. 
 
అయితే, ఈ మట్టి తమ చేతులకు అంటుకోకుండా బ్యాంకు బ్రాంచీల ద్వారా అమలు చేయాలని ఉద్దేశంతో నూతన ప్రతిపాదన చేసింది. ఈ మేరకు 'డిస్కషన్ పేపర్ ఆన్ ఛార్జెస్ ఇన్ పేమెంట్స్ సిస్టమ్స్'లో ఆర్బీఐ ప్రస్తావించింది. నగదు లావాదేవీ విలువ రూ.2 లక్షలు మించితే రూ.25 వరకు ప్రాసెసింగ్ ఫీజు విధించేందుకు ప్రతిపాదనలో పేర్కొంది. 
 
మరోవైపు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ కలిగివున్న ఖాతాదారుల ఆన్‌లైన్ ఎన్‌ఈఎఫ్‌టీ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించొద్దని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇది సేవింగ్స్ ఖాతాదారులకు ఊరటనిచ్చే విషయం. ఈ మేరకు డిస్కషన్ పేపర్ బుధవారం(17 ఆగస్టు 2022)న విడుదల చేసింది. కాగా ప్రస్తుతానికి ఎన్‌ఈఎఫ్‌టీ లావాదేవీలకు సంబంధించి బ్యాంకులపై ఆర్బీఐ ఎలాంటి ఫీజులు విధించడం లేదనే విషయం తెలిసిందే.