గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 జులై 2022 (17:17 IST)

ఇండియన్ కరెన్సీ చెల్లింపులు.. ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోండి.. ఆర్బీఐ

reserve bank of india
అంతర్జాతీయ వ్యాపారంలో ఎగుమతులు, దిగుమతుల కోసం రూపాయల్లో చెల్లించేందుకు బ్యాంక్‌లు తగిన ఏర్పాట్లు చేయాలని నాడు ఆర్బీఐ కోరింది.అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు, అంతర్జాతీయ వ్యాపారులు ఇండియన్‌ రూపాయల్లో చెల్లింపుల పట్ల ఆసక్తి చూపిస్తున్నందున ఈ మేరకు బ్యాంక్‌లు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. 
 
గ్లోబల్‌ ట్రేడ్‌లో ఇన్‌వాయిస్‌ చెల్లింపులు, ఎగుమతులు, దిగుమతుల సెటిల్‌మెంట్స్‌ను రూపాయల్లో చెల్లించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌లోని ఫారిన్‌ ఎక్స్ఛెంజ్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి బ్యాంక్‌లు అవసరమైన అనుమతులు తీసుకోవాలని కోరింది. కొత్త విధానంలో అంతర్జాతీయ వాణిజ్యంలో మారకపు రేటును ఇక నుంచి రూపాయల్లో చెల్లిస్తారు.