శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 జూన్ 2022 (13:47 IST)

క్రెడిట్‌ కార్డులకు కూడా యూపీఐ ఫ్లాట్‌ఫామ్స్

డెబిట్‌ కార్డును మాత్రమే యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌ (ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటివి) కు యాడ్ చేసుకోవడానికి వీలుండేది. తాజా ఎంపీసీ మీటింగ్‌లో క్రెడిట్‌ కార్డులను కూడా యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌కు యాడ్ చేసుకోవడానికి ఆర్‌బీఐ అనుమతిచ్చింది. 
 
ఈ నిర్ణయంతో డిజిటల్ పేమెంట్స్ మరింతగా పెరుగుతాయని రిజర్వ్ బ్యాంక్ అంచనావేస్తోంది. మొదట నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇష్యూ చేసే రూపే క్రెడిట్‌ కార్డులతో ఈ ఫెసిలిటీని స్టార్ట్ చేయనున్నారు. 
 
దీంతో పాటు డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులు, ఇతర ప్రీపెయిడ్‌ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ (పీపీఐ) ల ద్వారా జరిగే రికరింగ్‌ ట్రాన్సాక్షన్లపై ఈ-మేండెట్‌ను ప్రస్తుతం ఉన్న రూ. 5 వేల నుంచి రూ. 15 వేలకు పెంచారు.