బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జూన్ 2022 (20:06 IST)

ఆర్బీఐ కీలక నిర్ణయం: రూ.5వేల లిమిట్‌ను రూ.15వేలకు పెంపు

credit cards
క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పేమెంట్స్ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.5,000గా ఉన్న లిమిట్ పెంచాలని బ్యాంకుల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. 
 
ఇన్స్యూరెన్స్ ప్రీమియం, పిల్లల స్కూల్ ఫీజు, ఇతర సబ్‌స్క్రిప్షన్స్ కోసం లిమిట్ పెంచాలని బ్యాంకులు కోరాయి. బ్యాంకుల అభ్యర్థనలతో ఆర్‌బీఐ లిమిట్‌ను రూ.15,000కి పెంచింది. ప్రస్తుతం రూ.5,000 గా ఉన్న లిమిట్‌ను రూ.15,000 చేసింది.
 
క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇతర ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పీపీఐఎస్) విషయంలో రికరింగ్ ట్రాన్సాక్షన్స్ అంటే ప్రతీ నెలా చెల్లింపుల కోసం ఇ-మ్యాండేట్, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ లిమిట్‌ను పెంచింది ఆర్‌బీఐ. 
 
ఇందుకు సంబంధించిన నియమనిబంధనల్ని ఆర్‌బీఐ విడుదల చేయనుంది. ఇ-మ్యాండేట్ రికరింగ్ పేమెంట్స్‌కు అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆథెంటికేషన్ తప్పనిసరి. కస్టమర్లకు ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. కస్టమర్లు ఆథెంటికేట్ చేస్తేనే పేమెంట్ పూర్తవుతుంది.
 
ఇక ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రూపే క్రెడిట్ కార్డుల్ని యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌కి లింక్ చేయనుంది. రూపే క్రెడిట్ కార్డుల్ని యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌కి లింక్ చేస్తే మీరు మీ క్రెడిట్ కార్డ్స్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. ప్రస్తుతం కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ మాత్రమే యూపీఐకి లింక్ అయ్యాయి.