భారతీయులకు భారీ షాకిచ్చిన యాపిల్
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ భారతీయులకు భారీ షాకిచ్చింది. యాప్ స్టోర్‌లో యాప్‌లు, సబ్‌స్క్రిప్షన్‌ల కోసం డెబిట్, క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు స్వస్తి పలికింది. యూజర్లు అల్ట్రనేట్‌గా చెల్లింపుల కోసం ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలని యాపిల్ తన బ్లాగ్‌లో స్పష్టం చేసింది.
అయితే వినియోగదారులు తమ యాపిల్ ఐడీలో ఉన్న బ్యాలెన్స్‌తో యాప్‌లు, సబ్‌స్క్రిప్షన్‌ల చెల్లింపులు చేసుకోవచ్చు. యాపిల్ ఐడీలో మరింత బ్యాలెన్స్ కావాలనుకుంటే యాప్ స్టోర్ కోడ్‌లు, నెట్ బ్యాంకింగ్, యూపీఐలను వినియోగించుకోవచ్చు.