బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2022 (10:39 IST)

ఆపిల్ ధరతో పోటీపడుతున్న నిమ్మకాయలు

తెలుగు రాష్ట్రాల్లో వేసవి ఎండలు అదరగొడుతున్నాయి. దీంతో నిమ్మకాయలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు అటు తెలంగాణ రాష్ట్రాల్లో నిమ్మకాయలకు గిరాకీ పెరిగిపోతోంది. దీంతో వీటి ధరలు ఆపిల్ ధరలతో పోటీపడుతున్నాయి. 
 
సోమవారం నుంచి కొత్తగా ఏర్పాటైన కొత్త జిల్లాల జాబితా ప్రకారం తిరుపతి జిల్లా గూడూరు మార్కెట్‌లో ఆదివారం మొదటిరకం కిలో నిమ్మకాయలు 160 రూపాయలు చొప్పున అమ్ముడుపోయాయి. 
 
రెండో రకం నిమ్మకాయల ధర రూ.130 నుంచి రూ.150 వరకు పలికింది. నిమ్మపండ్లు ధర రూ.100 నుంచి రూ.130 మధ్య పలికింది. గత యేడాదితో పోలిస్తే వీటికి ఇపుడు రెట్టింపు ధర పలుకుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఇకపోతే, ఇదే జిల్లాలో కిలో ఆపిల్ ధర కూడా రూ.150 నుంచి రూ.200 పలుకుతుండటం గమనార్హం.