శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2022 (10:30 IST)

ఏపీలో ఒక్కపూట బడులు.. టెన్త్ విద్యార్థులకు అదనపు తరగతులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నుంచి ఒక్కపూట బడులు ప్రారంభమయ్యాయి. ఈ బడులు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. మరోవైపు, ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అదనపు తరగతులను నిర్వహించేలా విద్యార్థులు చర్యలు తీసుకున్నారు. 
 
అయితే, ఒక్కపూట బడికి వచ్చే విద్యార్థులకు స్కూల్ ముగిసిన తర్వాత మధ్యాహ్న భోజనం పెట్టి ఇంటికి పంపిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఆదేశాలు జారీచేశారు. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 
 
కాగా, తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. దీంతో విద్యార్థులు ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికి ఒంటిపూట బడులు ప్రారంభించింది. ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సోమవారం నుంచి ఒక్కబడులు నిర్వహించేలా చర్యలు తీసుకుంది.