ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 13 ఏప్రియల్ 2022 (16:25 IST)

డిజిటల్ చెల్లింపులతో దూసుకుపోతున్న భారత్: ప్రధాని మోదీ ఏమన్నారంటే?

narendra modi
కరెన్సీ నోట్ల వాడకం బాగా తగ్గింది. కరోనా వైరస్ పుణ్యమా అని చాలామంది కరెన్సీ నోట్లు తీసుకోవడం మానేశారు. క్రమంగా జి-పే, ఫోన్ పే, నెట్ బ్యాంకింగ్... తదితర మార్గాల ద్వారా నగదు బదిలీ చేస్తున్నారు. ఈ లావాదేవీలు ఎలా జరుగుతున్నాయన్నదానిపై ఇండియా ఇన్ పిక్జల్స్ సమగ్రంగా ఓ గ్రాఫ్ ద్వారా చూపించింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.

 
ఆయన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ.... ''నేను UPI, డిజిటల్ చెల్లింపుల గురించి చాలా తరచుగా మాట్లాడుతున్నాను, అయితే ఆ వాడకం ఎలా వుందో సమర్థవంతంగా తెలియజేయడానికి మీరు డేటా సోనిఫికేషన్ ద్వారా లావాదేవీలు జరిపిన డబ్బును ఎలా ఉపయోగించారో నాకు బాగా నచ్చింది. చాలా ఆసక్తికరమైన, ఆకట్టుకునే, స్పష్టమైన సమాచారం చూస్తున్నా''