బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 జూన్ 2022 (16:23 IST)

యూపీఐ: మే నెలలో అత్యధిక లావాదేవీలు..

digital payments
దేశంలో 2016 నుంచి యూపీఐ అమల్లోకి వచ్చింది. కరోనా సంక్షోభం కారణంగా ఆన్‌లైన్ చెల్లింపులు, ఇతర లావాదేవీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీఐ వ్యవస్థ తర్వాత తొలిసారిగా మే నెలలో అత్యధిక లావాదేవీలు చోటుచేసుకున్నాయి. 
 
ఏకంగా 595 కోట్ల యూపీఐ ఆధారిత లావాదేవీలు జరిగాయి. వాటి మొత్తం విలువ రూ.10 లక్షల కోట్లు కావడం విశేషం. ఇప్పటివరకు ఇదే రికార్డు. ఈ స్థాయిలో లావాదేవీలు జరగడం యూపీఐ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది.