మంగళవారం, 12 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (10:05 IST)

జూలై 1 నుంచి డెబిట్ కార్డ్స్‌కు కొత్త నిబంధనలు.. టోకేనైజేషన్‌ను అమలు

cards
డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డుల వినియోగం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మార్పులు తీసుకువస్తోంది. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. జూలై నెల నుంచి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు డెబిట్‌, క్రెడిట్‌ కార్డు టోకేనైజేషన్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. 
 
గత సంవత్సరం ఆర్బీఐ, బ్యాంకులు,ఆర్థిక సంస్థలు ఈ ఫ్రేమ్‌వర్క్‌పై కసరత్తు చేస్తున్నాయి. జనవరి 1 నుంచే అమలు చేయాల్సి ఉండగా, బ్యాంకుల కోరిక మేరకు మరో ఆరు నెలల పాటు గడువు పొడిగించారు. ఇప్పుడు గడువు పూర్తి కావడంతో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
 
ఈ నేపథ్యంలో లావాదేవీలు చేపట్టేటప్పుడు డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు వివరాలను నమోదు చేస్తుంటారు. కార్డు మీదున్న 16 అంకెలు, కార్డు ఎక్స్‌పైరీ డేట్‌, సీవీవీ, ఓటీపీ, పిన్‌ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్ని సరిగ్గా ఉంటేనే లావాదేవీలు జరిపేందుకు వీలుంటుంది. లేకుంటే అనుమతించదు. 
 
ఈ ప్రక్రియ అంతా ఇకపై టోకెనైజేషన్‌ భర్తీ చేస్తుంది. ఇందుకు మీ కార్డు వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. మీ కార్డుకు సంబంధించిన టోకెనైజేషన్‌ నమోదు చేస్తే చాలు. 
 
అలాగే కస్టమర్లు తమ కార్డును టోకెన్‌ రిక్వెస్ట్‌ అందించే ఒక ప్రత్యేక యాప్‌ ద్వారా టోకెనైజ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టోకెన్ రిక్వెస్టర్‌ వినియోగదారుడి అభ్యర్థనను కార్డ్ నెట్‌వర్క్‌కు చేరవేస్తుంది. కార్డు జారీ చేసిన సంస్థ అనుమతితో చివరిలో టోకెన్‌ జారీ అవుతుంది.
 
కాంటాక్ట్‌లెస్ కార్డు లావాదేవీలు, క్యూఆర్ కోడ్‌లు, యాప్‌ల ద్వారా చెల్లింపులకు టోకెనైజేషన్‌ను అనుమతించారు. ఎప్పుడైనా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు కార్డ్ వివరాలు ఎంటర్ చేయకుండా టోకెన్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది.