ఆర్బీఐ సెంట్రల్ బోర్డు డైరక్టర్‌గా ఆనంద్ మహీంద్రా
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లో పార్ట్ టైమ్ నాన్-అఫీషియల్ డైరెక్టర్లుగా పలు పరిశ్రమకు చెందిన నలుగురు ప్రముఖులను ప్రభుత్వం నియమించింది.
వీరిలో ఆనంద్ మహీంద్రా కూడా వున్నారు. ఆనంద్ మహీంద్రాతో పాటు.. రవీంద్ర ధోలాకియా, వేణు శ్రీనివాసన్, పంకజ్ పటేల్‌లను కూడా ఆర్బీఐ డైరెక్టర్లుగా నియమించింది కేంద్ర ప్రభుత్వం.
ఈ కొత్త అపాయింట్‌మెంట్‌లు నాలుగు సంవత్సరాల పాటు ఉంటాయి. కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఈ నియామకాలకు ఆమోదం తెలిపింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టానికి అనుగుణంగా కేంద్రం నియమించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ద్వారా రిజర్వ్ బ్యాంక్ వ్యవహారాలు నియంత్రించబడతాయి.