గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 మే 2022 (11:16 IST)

సర్కారు వారి పాటపై ఆనంద్ మహీంద్ర కామెంట్..

Maheshbabu, Sartkarvari pata
సర్కారు వారి పాట మూవీపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్‌ చేశారు. ఈ సినిమాకు సంబంధించి అనుపమ్‌ తరేజా షేర్ చేసుకున్న వీడియోను రీట్వీట్ చేస్తూ.. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, జావా మెరూన్‌ల కాంబినేషన్‌ అన్‌బీటబుల్ అని అన్నారు. 
 
ఈ కాంబినేషన్‌ను తాను ఎలా చూడకుండా ఉండగలనన్నారు. ప్రస్తుతం తాను న్యూయార్క్‌లో ఉన్నానని.. న్యూ జెర్సీకి వెళ్లి సినిమా ఎక్కడ ఆడుతుందో అక్కడికి వెళ్లి చూస్తానని చెప్పారు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్ అవుతోంది.
 
'సర్కారు వారి పాట' మూవీ హిట్ తరువాత మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించనున్నాడు. 'అతడు', 'ఖలేజా' మూవీల తరువాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో మూవీ రానుంది. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది.