1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 17 మే 2022 (05:42 IST)

డాన్స్‌లేసి ఆనందాన్ని వ్య‌క్తం చేసిన మ‌హేష్‌, థ‌మ‌న్‌

Mahesh, Thaman dance
Mahesh, Thaman dance
సర్కారు వారి పాట మాస్ సక్సెస్ సెలబ్రేషన్స్ సోమ‌వారం రాత్రి  కర్నూల్‌లో ఘనంగా నిర్వహించారు. అభిమానులు స‌మ‌క్షంలో మ‌హేష్‌బాబు త‌న పై వ‌స్తున్న పాట ~మాస్ మాస్‌.మ‌హేషా..` అన్న పాట‌కు కింద‌నుంచి స్టేజీపైకి వెళ్ళి డాన్స‌ర్ల‌తో డాన్స్ వేసి అల‌రించారు. ఈ సంద‌ర్భంగా సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ కూడా తోడ‌యి అభిమానుల‌ను ఉత్సాహ‌ప‌రిచారు.
 
సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. మహేష్ గారి ఫిగర్ క్లాస్.. కానీ ఆయనకి వచ్చే కలెక్షన్స్ మాత్రం మాస్.  ఈ సినిమాకి అనంత్ శ్రీరామ్ చక్కని సాహిత్యం అందించారు. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అద్భుతమైన సహకారం ఇచ్చారు. ఈ ఆల్బమ్ క్రెడిట్ దర్శకుడు పరశురాం కి ఇస్తాను. ఆయన లేకపోతే ఇంత చక్కని ఆల్బం వచ్చేది కాదు. మహేష్ బాబుగారి పై వున్న ఇష్టాన్ని పాటల్లో చూపించారు. ఈ సక్సెస్ కారణం మహేష్ బాబు గారే. ఆయన నింపిన ఎనర్జీ మామూలుది కాదు. మ్యూజిక్ చేసినప్పుడు కీ బోర్డులు పగిలిపోయేవి. అంత ఎనర్జీ ఆయనలో వుంది. దూకుడు నుండి మా ప్రయాణం. ఆయన ఒకొక్క సినిమాకి రేంజ్ పెంచుకుంటూ వెళుతున్నారు. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్.
 
గీత రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. సర్కారు వారి పాట కోసం చెప్పకురా తోలు తొక్క. తప్పదు నా వడ్డీ లెక్క'' అని రాశాను. ఆ పాటలో అన్నట్టుగానే ఇదు రోజుల్లోనే అసలు మొత్తం వసూళు చేసి, వడ్డీ మీద బారు వడ్డీ దానిమీద చక్రవడ్డీ సినిమా వసూళు చేసుకుంటూ సర్కారు వారి పాట దూసుకుపోతుంది.  అభిమానులు గర్జనలు చూస్తుంటే ఈ విజయం ఇక్కడితో ఆగేలాలేదు. ఈ సినిమాలో ఐదు పాటలు రాసే అవకాశం ఇచ్చి, ప్రతి పాట రాయడానికి ఊతనిచ్చిన దర్శకుడు పరశురాం గారికి ధన్యవాదాలు. సంగీత దర్శకుడు తమన్ గారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాని భుజస్కందాలపై మోసి ఇంత గొప్ప విజయానికి కారణమైన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి వేవేలా ప్రణామాలు.  సర్కారు వారి పాటని ఇంత  ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ నిర్మాతలకు కృతజ్ఞతలు'' తెలిపారు.