శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 మే 2022 (08:23 IST)

సైబర్ నేరగాడి చేతిలో మోసపోయిన వైకాపా ఎంపీ - రూ.97 వేలు మాయం

cyber crime
ఓ సైబర్ నేరగాడి చేతిలో సాక్షాతో ఓ ఎంపీ మోసపోయాడు. ఫలితంగా ఎంపీ ఖాతా నుంచి రూ.97 వేలను సైబర్ నేరగాడు క్షణాల్లో ఖాళీ చేశాడు. మోసపోయిన వైకాపా ఎంపీ పేరు సంజీవ్ కుమార్. వైకాపా ఎంపీ. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఎంపీ సంజీవ్ కుమార్‌కు మీ బ్యాంకు ఖాతా బ్లాక్ అయిందని, దాన్ని వెంటనే పాన్ నంబరుతో అప్‌డేట్ చేసుకోవాలంటూ ఓ సందేశం వచ్చింది. ఇందుకోసం కింది లింక్‌ను క్లిక్ చేయాలని అందులో ఉంది. ఈ సందేశం నిజమేనని నమ్మిన ఎంపీ లింక్ ఓపెన్ చేసి వివరాలను ఫిల్ చేసి సెండ్ చేశాడు. ఆ వెంటనే ఆయనకు మొబైల్ నంబరుకు ఓటీవీ వచ్చింది. 
 
ఆ మరుక్షణం సైబర్ నేరగాడు ఫోన్ చేసి తాను హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానని బ్యాంకు ఖాతా వివరాలను అప్‌డేట్ చేసేందుకు మొబైల్‌కు వచ్చిన ఓటీపీ చెప్పాలని కోరడంతో సదరు ఎంపీ ఆ ఓటీపీని చెప్పాడు. ఆ తర్వాత కాసేపటికే ఒకసారి రూ.48,700, మరో దఫా రూ.48,999 డ్రా అయినట్టు ఎంపీకి ఫోను సందేశం వచ్చింది. 
 
అది చూసి హతాశుడైన ఎంపీ తాను సైబర్ నేరగాడి చేతిలో మోసపోయినట్టు గ్రహించి బ్యాంకుకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. అలాగే, సైబర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. సైబర్ నేరగాడు మంత్రి ఖాతా నుంచి రూ.97699 కాజేసినట్టు తేలింది. పోలీసులు కేసును విచారిస్తున్నారు.