శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 సెప్టెంబరు 2021 (21:38 IST)

టక్ జగదీష్' వచ్చేసింది @Prime.. రాత్రి పది గంటలకే..!

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. 
 
‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ‘టక్ జగదీష్’కు థమన్ సంగీతం అందించారు. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. 
 
ఓటిటి విషయంలో చాలా తర్జన భర్జనలు పడిన అనంతరం మేకర్స్ ఈ సినిమాను వినాయక చవితి కానుకగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. అయితే సినిమా “టక్ జగదీష్” అనుకున్న సమయం కంటే ముందుగానే అందుబాటులోకి రానున్నాడు. ఈ రోజు రాత్రి 10 గంటల తరువాత అమెజాన్ ప్రైమ్ లో “టక్ జగదీష్” ప్రీమియర్ కానుంది.