సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (19:02 IST)

అద్దంలో మొహం చూసుకో పో.. మొహం గురించి మాట్లాడితే..? (video)

బిగ్ బాస్ ఐదో సీజన్ మొదలైంది. ఈ షో మొదలై రెండు రోజులు కూడా గడవక ముందే హౌజ్‌ మేట్స్‌ మధ్య రచ్చ రంబోలా మొదలైంది. మంగళవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో ప్రేక్షకులకు ఫుల్‌ డ్రామా లభించేలా కనిపిస్తోంది. కాసేపటి క్రితమే విడుదలైన ప్రోమో ఇదే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. మంగళవారం ఎపిసోడ్‌లో సిరి, లోబోల మధ్య వాగ్వాదాం తార స్థాయికి చేరినట్లు తెలుస్తోంది.
 
‘ఏయ్‌.. నీకు ప్రాబ్లమ్‌ ఉంటే నాకు చెప్పు.. వాళ్లకు వీళ్లకు చెప్పకు’ అని లోబో అనగానే సిరి మాత్రం సింపుల్‌గా ‘ఎల్లహే’ అని అంటుంది. దీనికి ఒక్కసారిగా సీరియస్‌ అయిన లోబో.. సక్కగా మాట్లాడు అని అంటాడు. 
 
దీనికి సిరి బదులిస్తూ ‘నన్ను గెలికితే ఇలాగే మాట్లాడుతాను’ అని దురుసుగా సమాధానం ఇస్తుంది. అంతటితో ఆగని లోబో.. ‘అద్దంలో మొహం చూసుకో పో’ అంటాడు. దీంతో సిరి మొహం గురించి మాట్లాడితే మొహం పగిలి పోద్ది అని బదులిస్తుంది. వీరిద్దరి మధ్య డైలాగ్‌ వార్స్‌తో ఒక్కసారిగా హౌజ్‌లో సీరియస్‌ వాతావరణం అల్లుకుంది.
 
ఇక ఈ రోజు హౌజ్‌లో కాజల్‌, లహరిలకు మధ్య వాగ్వాదం జరగనుంది. ‘కాజల్‌ ఎందుకు హైపర్‌గా మాట్లాడుతున్నావు.. కంటెంట్‌ను కావాలని క్రియేట్‌ చేయకు’ అంటూ లహరి అనగానే.. భావోద్వేగానికి గురైన కాజల్‌ కంటతడి పెట్టుకుంది. బిగ్‌బాస్‌ లేటెస్ట్‌ ప్రోమోను మీరూ ఓ లుక్కేయండి.