శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 సెప్టెంబరు 2021 (12:14 IST)

గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన ఇటలీ పైలట్ (video)

Italian pilot
ఇటలీకి చెందిన స్టంట్ పైలట్ డారియో కోస్టా.. గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న రెండు టన్నెళ్ల నుంచి విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించాడు. నిజానికి వాహనాలు వెళ్లేందుకు నిర్మించిన రెండు టన్నెళ్ల నుంచి ఆ పైలెట్ విమానంతో దూసుకెళ్లడం అద్భుతం. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను చూస్తే ఆ స్టంట్ ఏంటో తెలుస్తుంది. 
 
దాదాపు ఏడాది పాటు 41 ఏళ్ల పైలట్ డారియో.. టన్నెల్ ఫ్లయింగ్ కోసం ట్రైనింగ్ తీసుకున్నాడు. జివ్‌కో ఎడ్జ్ 540 రేస్ ప్లేన్‌తో అతను ఈ స్టంట్‌ నిర్వహించాడు. శనివారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఈ ఫీట్ చేపట్టాడు. ఫస్ట్ టన్నెల్ నుంచి అతను తన విమాన రేస్‌ను ప్రారంభించాడు. కోస్టా సుమారు 43.33 సెకన్ల పాటు టన్నెళ్లలో విమానాన్ని నడిపాడు. 1.4 మైళ్ల దూరాన్ని.. టీ1, టీ2 అని పిలిచే టన్నెళ్ల నుంచి ప్రయాణించాడు. ఇస్లాంబుల్ శివారుల్లోని నార్తర్న్ మర్మరా హైవేపై ఆ టన్నెళ్లు ఉన్నాయి.
 
టన్నెల్ రేస్‌లో పైలట్ డారియో తన విమానంతో అత్యధికంగా 152 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లాడు. టన్నెల్ గోడలు, విమానం రెక్క మధ్య 11.5 ఫీట్ల దూరంతో విమానాన్ని నడిపాడు. అయితే తొలి టన్నెల్ దాటి.. రెండవ టన్నెల్‌లోకి ఎంటర్ అవుతున్న సమయంలో.. విమానాన్ని నియంత్రించడం కష్టంగా మారినట్లు పైలట్ చెప్పాడు.