సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 22 జులై 2021 (20:34 IST)

భారతదేశంలో తమ మొదటి వీడియో గేమ్‌ ల్యాండ్‌ ఆఫ్‌ వండర్స్‌ను ఆవిష్కరించిన ఇటలీ

ఇటలీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఇటాలియన్‌ ఎంఎఫ్‌ఏ) తమ వీడియో గేమ్‌ ‘ఇటలీ ల్యాండ్‌ ఆఫ్‌ వండర్స్‌’ను ఆవిష్కరించినట్లు వెల్లడించింది. ఇటలీ సాంస్కృతిక వారసత్వం, అద్భుతాలను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు మరీ ముఖ్యంగా యువతకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ వీడియో గేమ్‌ను విడుదల చేశారు. యువతతో పాటుగా చిన్నారులను సైతం ఆకట్టుకునే రీతిలో గ్రాఫిక్‌ నేపథ్యంలో దీనిని తీర్చిదిద్దారు.
 
‘ఇటలీ. ల్యాండ్‌ ఆఫ్‌ వండర్స్‌’ వీడియోగేమ్‌, ఇటలీ యొక్క అందాలు, సంప్రదాయాలను అనుసంధానిత మరియు వినోదాత్మక అనుభవాలతో అందిస్తుంది. ఆంగ్ల భాషలో పూర్తి ఉచితంగా లభ్యమయ్యే ఈ వీడియో గేమ్‌ను భారతదేశంలో  19 జూలై 2021న ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌, టాబ్లెట్‌ వినియోగదారుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఇటాలియన్‌ సంస్కృతిని ప్రచారం చేయడం కోసం పూర్తిగా అంకితం చేయబడిన ఇటాలియన్‌ ఎంఎఫ్‌ఏ యొక్క నూతన వెబ్‌సైట్‌ ద్వారా విడుదల చేశారు.
 
ఈ ప్రభావ శీల గేమ్‌లో పలు ఆసక్తికరమైన క్యారెక్టర్లు ఉంటాయి. ఈ క్యారెక్టర్లు, వినియోగదారులు అద్భుతమైన ఇటలీని అన్వేషించడంలో సహాయపడతాయి. అతి పురాతనమైన లైట్‌హౌస్‌ కీపర్‌ ఎలియో, ఇటలీలోని 20 ప్రాంతాల నుంచి ముందు రోజు రాత్రి  అతను తిరిగిపొందిన 20 కిరణాల సహాయంతో ప్రతి ఉదయం సూర్యుడిని వెలిగించడంతో పాటుగా అతను దేశమంతా తన కిరణాలు ప్రసరించేలా చేస్తాడు. ఈ గేమ్‌, సూర్యాస్తమం వేళ ఆరంభమవుతుంది. ఎలియో- అతి పురాతనమైన గ్రీకు పురాణాలలో సూర్య దేవుడైన హెలియోస్‌కు ప్రతిరూపం ఓ సహాయకుని కోసం చూస్తుంటారు.
 
ఆ సహాయకుడు తన కష్టమైన పనులను పూర్తిచేయడంలో సహాయపడాలనీ కోరుకుంటారు. లైట్‌హౌస్‌కు వెలుపల ఓ రహస్య క్యారెక్టర్‌ను కూడా నియమిస్తాడు. రాత్రి పూట సాహసానికి పూనుకుని ఇటలీ చుట్టూ తిరుగుతూ 20 ప్రకాశవంతమై కాంతులను పునరుద్ధరించడంతో పాటుగా లైట్‌హౌస్‌ వెలిగించడానికి, మరలా సూర్యుడు ప్రకాశించడానికి భరోసా అందిస్తాడు.
 
ఈ ప్రయాణంలో, ఆటగాళ్లు ఐదుగురు గార్డియన్స్‌ను కలుసుకుంటారు. ఈ గార్డియన్స్‌, ఆటగాళ్లను ప్రకృతి, వంటకాలు, కళలు, ప్రదర్శన మరియు డిజైన్‌కు చేరుకునేందుకు మార్గనిర్దేశనం చేస్తారు. ఈ ఐదు అంశాలూ ఇటాలియన్‌ సాంస్కృతిక వారసత్వంకు కీలకమైన ఐదు అంశాలు. ఈ ప్రయాణం చివరలో భారీ అద్భుతం ఆటగాళ్ల కోసం వేచి చూస్తుంటుంది. వారు ఎలియో యొక్క ప్రాంగణంకు తీసుకువెళ్లడంతో పాటుగా, నూతన లైట్‌హౌస్‌ కీపర్‌ ప్రతీకగా మారతారు. దేశపు నిధులను కాపాడే లక్ష్యంతో వీరు ఆ పని చేపడతారు. అయితే, మొదటగా, వారు 100కు పైగా పజిల్‌ గేమ్‌ లెవల్స్‌ను వారు అధిగమించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటీ ప్రతిష్టాత్మకమైన ఇటాలియన్‌ ల్యాండ్‌మార్క్‌ 3డీ రీ కన్‌స్ట్రక్షన్‌ను కలిగి ఉంటుంది. ఈ గేమ్‌ లెవల్స్‌ పూర్తి ఆసక్తికరంగా, దశలవారీగా దేశపు తీరప్రాంతాల నుంచి పర్వతాలు, నగరాలు, కోటలు, సంప్రదాయాలు మరియు అపోహలు ద్వారా తీసుకువెళ్లాయి.
 
ఒపెరా నుంచి బరోక్యు మొదలు సుప్రసిద్ధ సినిమాల సౌండ్‌ ట్రాక్స్‌ వరకూ, ఈ వీడియో గేమ్‌లోని సంగీతం గ్రేట్‌ ఇటాలియన్‌ క్లాసిక్స్‌ స్ఫూర్తితో ఉంటుంది. ఈ సంగీతం, గేమ్‌కు అవసరమైన భావోద్వేగాలను తీసుకురావడంతో పాటుగా ఇటాలియన్‌ భాషను బోధించే పాఠశాలలకు సమాచారయుక్త, అనుసంధానిత ఉపకరణంగా నిలుస్తుంది.
 
ఇటలీతో పూర్తిగా పరిచయం ఉన్న వారితో పాటుగా, అసలు పరిచయం లేకున్ననూ, ఇటలీ గురించి మరింతగా తెలుసుకుందామనుకునే వారి కోసం సృష్టించబడిన ఈ గేమ్‌తో వారు ఇటలీ భాషను మరింతగా అవగాహన చేసుకోగలరు. ఇటలీ. ల్యాండ్‌ ఆఫ్‌ వండర్స్‌ గేమ్‌ ఇప్పుడు ట్రావెల్‌ గైడ్‌గా కూడా సేవలనందించనుంది. దీనిలో 600కు పైగా ఆర్టికల్స్‌, కథలు మరియు సమాచారం, వాస్తవాలతో నింపబడి ఉన్నాయి.
 
ఇటలీ. ల్యాండ్‌ ఆఫ్‌ వండర్స్‌ మాత్రం ఇటాలియన్‌ ఎంఎఫ్‌ఏ యొక్క కోవిడ్‌ అనంతర పోగ్రామింగ్‌ వ్యూహంల భాగంగా ఉంది. ఇది ఇటాలియన్‌ సంస్కృతి మరియు సృజనాత్మక రంగాలకు మద్దతునందిస్తుంది. అంబాసిడర్‌ లొరెన్జో అంగెలోనీ, డైరెక్టర్‌ జనరల్‌ ఫర్‌ కల్చరల్‌ అండ్‌ ఎకనమిక్‌ ప్రొమోషన్‌, ఇన్నోవేషన్- మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ మాట్లాడుతూ ‘‘ఎలాంటి కంటెంట్‌ అయినా, అంటే సాంస్కృతిక, సమాచార యుక్త సమాచారం కూడా వ్యాప్తి చెందేందుకు  అతి ముఖ్యమైన మార్గంగా నేడు మొబైల్‌ గేమింగ్‌ మార్కెట్‌ నిలిచింది.
 
మా దేశాన్ని మరియు దాని సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు లభించే ఏ చిన్న అవకాశాన్ని అయినా సద్వినియోగం చేసుకుని ప్రచారం చేయడం మా విధి. ఈ కారణం చేతనే మేము ఈ మొబైల్‌ వేదికపై ఆధార పడటంతో పాటుగా మా మంత్రిత్వ శాఖకు  మాత్రమే కాదు, ఇటాలియన్‌ ప్రజా పరిపాలన విభాగానికి సైతం నూతనమైన మార్గంలో ప్రచారం చేస్తున్నాం. ‘ఇటలీ. ల్యాండ్‌ ఆఫ్‌ వండర్స్‌’తో యువతరం ను కలుసుకోవడంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరితోనూ అనుసంధానించబడడం ద్వారా మా దేశం పట్ల వారికి ఆసక్తి కలిగిస్తూనే, మా దేశ అందాల పట్ల ఆసక్తినీ కలిగించనున్నాం. అదే సమయంలో, వారికి ఆయా ప్రదేశాల పట్ల పూర్తి అవగాహన కల్పిస్తూనే మా భూభాగాలు, ఉత్పత్తులను వాస్తవంగా కనుగొనేందుకు మార్గనిర్దేశకత్వం చేస్తుంది’’ అని అన్నారు.
 
ఆయనే మరింతగా జోడిస్తూ ‘‘ఇటలీ. ల్యాండ్‌ ఆఫ్‌ వండర్స్‌’ కేవలం ఓ మొబైల్‌ గేమ్‌ మాత్రమే కాదు.  ఇది అసలైన ఇటలీ తయారీ ఉత్పత్తి. అత్యంత నైపుణ్యంగా సంస్కృతితో సాంకేతికతను మిళితం చేశారు.  మా దేశపు వాతావరణంలో పూర్తిగా లీనమైపోండిః ఇది ప్రతి ఒక్కరూ అందం, సృజనాత్మకత మరియు ఇటలీ రుచులను సాహసోపేతంగా కనుగొనడంలో తోడ్పడుతుంది’’ అని అన్నారు.