శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 జులై 2021 (18:57 IST)

చెర్రీ చేతిలో గన్.. రామ్ చేతిలో బల్లెం.. భారత బృందానికి ఆర్ఆర్ఆర్ విషెస్

జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్ పోటీలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ విశ్వక్రీడల్లో పాల్గొనే భారత బృందానికి ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపింది. ఇదే అంశంపై ఓ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. 
 
ఇందులో గ‌న్ చేత ప‌ట్టిన రామ్ చ‌ర‌ణ్‌ ఫోటో, బ‌ల్లెం ప‌ట్టిన ఎన్టీఆర్ పొటోని జ‌త చేసి శుభాకాంక్ష‌లు అందించింది. టోక్యో ఒలింపిక్స్‌‌లో పాల్గొనే ఇండియ‌న్ క్రీడాకారుల‌కు ఆల్ ది బెస్ట్ అంటూ ఆర్ఆర్ఆర్ టీం విషెస్ తెలిపింది. 
 
ప్ర‌త్యేక పోస్ట‌ర్ సినీ, క్రీడా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. అక్టోబ‌రు 13వ తేదీ 'ఆర్ఆర్ఆర్' చిత్రం విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.