బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 21 ఆగస్టు 2022 (16:00 IST)

జొమాటో క్షమాపణలు.. ఎందుకో తెలుసా? మహాకాళ్ తాళీ.. టెంపుల్ కాదు..

Zomato
జొమాటో వివాదంలో చిక్కుకుంది. హిందువులను కించపరిచే విధంగా యాడ్ ఇచ్చి వివాదంలో ఇరక్కుంది. ఇందుకు గాను ప్రస్తుతం క్షమాపణలు చెప్పింది. 
 
వివరాల్లోకి వెళితే.. తనకు ఆకలి అయితే మహాకాళి నుంచి ఆర్డర్ చేస్తానంటూ హృతిక్ రోషన్ నటించిన వివాదాస్పద ప్రకటన విషయంలో జొమాటో తన తప్పును సరిదిద్దుకుని క్షమాపణలు చెప్పింది.
 
ఉజ్జయిని మహాకాళేశ్వరం పూజారుల డిమాండ్ మేరకు ప్రకటనను సరిచేయడమే కాకుండా, జరిగిన పొరపాటుకు క్షమాపణలు కూడా కోరింది.
 
మహాకాల్ అన్న చోటు రెస్టారెంటును చేర్చి ప్రకటనలోని కంటెంట్ ను సవరించింది. అంతేకానీ, మహాకాళేశ్వర్ ఆలయం నుంచి కాదని వివరణ ఇచ్చింది.