ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 జులై 2022 (20:18 IST)

ఎట్టకేలకు వెనక్కి తగ్గిన అధిర్ రంజన్ : రాష్ట్రపతికి క్షమాపణలు

adhir ranjan
కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ విపక్ష నేత అధిర్ రంజన్ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని' అంటూ వ్యాఖ్యానించి, పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెల్సిందే. ఇదే అంశంపై కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. 
 
గతంలో లేని విధంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని బీజేపీ ఎంపీలు డైరెక్టుగా టార్గెట్ చేశారు. ఈ దృశ్యాలు పార్లమెంట్‌లో కనిపించాయి. కాంగ్రెస్ పార్టీ సభ్యుల నోటి దురుసుకు సోనియా గాంధీనే నాయకత్వం వహించాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. 
 
ఈ నేపథ్యంలో వివాదానికి మూలకారకుడైన అధిర్ రంజన్ చౌదరి తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. తన అనుచిత వ్యాఖ్యల పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుక్రవారం క్షమాపణలు చెప్పారు.