గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 మార్చి 2022 (14:02 IST)

కిచెన్ అప్లైన్సెస్.. వుమెన్స్ డే సందేశంపై ఫ్లిప్‌కార్ట్‌ క్షమాపణలు

హోలీ ఫెస్టివల్‌ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ మార్చి12 నుంచి మార్చి 16వరకు బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్స్‌ను ప్రారంభించనుంది. ఈ సేల్‌లో పలు ప్రొడక్ట్‌లపై భారీ ఎత్తున అంటే 80శాతం డిస్కౌంట్‌లు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్స్‌లో దిగ్గజ కంపెనీల స్మార్ట్‌ ఫోన్‌లు యాపిల్‌, రియల్‌ మీ,ఒప్పో,శాంసంగ్‌ 60శాతం వరకు డిస్కౌంట్‌కే అందించనుంది.
 
అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్లిఫ్ట్ కార్ట్ చేసిన పని వివాదాస్పదమైంది. కిచెన్ అప్లైన్సెస్‌ను ప్రమోట్ చేసే దిశగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వాడుకున్న ఫ్లిఫ్ కార్ట్ సారీ చెప్పింది. వుమెన్స్ డే సందర్భంగా రూ.299 నుంచి కిచెన్ అఫ్లెంన్సెస్‌ను పొందవచ్చునని ఫ్లిఫ్ కార్ట్ తెలిపింది.  
 
కానీ వుమెన్స్ డే సందర్భంగా కిచెన్ సామాగ్రిని ప్రమోట్ చేస్తూ వార్త ప్రచురించిన ఈ-కామర్స్ సైట్ మార్కెటింగ్ విభాగం తప్పు చేసిందని ఫ్లిఫ్ కార్ట్ ఓ ప్రకటనలో క్షమాపణలు కోరింది. వుమెన్స్ డే సందర్భంగా మహిళలకు కిచెన్ పరికరాలను పొందవచ్చుననే ప్రకటన సరికాదని నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. దీంతో ఫ్లిఫ్ కార్ట్ క్షమాపణలు కోరింది. 
 
మహిళా దినోత్సవ వార్తలపై నిరసనలు పెరగడంతో ఫ్లిప్‌కార్ట్ క్షమాపణలు చెప్పింది. "మేము గందరగోళంగా ఉన్నాం. క్షమించండి" అని ఇ-కామర్స్ కంపెనీ ట్విట్టర్‌లో రాసింది. "మేము ఎవరి మనోభావాలను కించపరచకూడదనుకుంటున్నాం. మహిళా దినోత్సవ సందేశానికి క్షమాపణలు కోరుతున్నాము" అని అది జోడించింది.