సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (18:19 IST)

మహిళల కోసం మంగ్లీ పాట పాడిందా? ఎక్కడా లేదే...? కానీ సందేశమైతే ఇచ్చింది ఇలా...

పాత విషయాలను ట్రెండ్ చేయడంలో సోషల్ మీడియాను మించింది లేదన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏది ట్రెండ్‌లో వుందంటే... ఆ టాపిక్‌కి సంబంధించి పాత సమాచారాన్ని కొత్తగా తేదీ మార్చేసి ఇదిగో ఇప్పుడే అంటూ సోషల్ మీడియాలో విసిరేస్తుంటారు. అలాగే తాజాగా ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మంగ్లీ ఓ పాట పాడారంటూ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది.

 
ఎక్కడా అని యూ ట్యూబ్ చూస్తే... 2020 తర్వాత ఈ టాపిక్ పైన ఏ పాటాలేదు. ఐతే ట్విట్టర్లోనో, ఫేస్ బుక్ లోనో ఏమయినా వుందంటే అదీ లేదు. చివరికి ఇన్‌స్టాగ్రాంలో మాత్రం మంగ్లీ చిడతలు పట్టుకుని వున్న ఓ ఫోటో దాని వెనుక హేపీ ఉమెన్స్ డే అంటూ ట్యాగ్ చేసి వుంది. మరి మంగ్లీ పాడిన పాట గంటల వ్యవధిలో అదృశ్యమయ్యిందా లేదంటే నిజంగానే పాడలేదా...? అదీ కాదంటే ట్రెండ్ కోసమే ఇలా కొత్త పాట అంటూ జనంలోకి విసిరారా? అన్నది పక్కన పెడితే...

 
మహిళా దినోత్సవం సందర్భంగా సింగర్ మంగ్లీ ఓ సందేశమైతే పోస్ట్ చేసారు. అదేంటంటే... ఒక స్త్రీ ఎటువంటి సంకోచం, ఒత్తిడి లేకుండా అనేక పాత్రలు చేయగలదు. ఆమె కుటుంబంలో తల్లి, సోదరి, భార్య కావచ్చు... అలాగే ఆమె యజమాని, అధికారి, శాస్త్రవేత్త, వైద్యురాలు కూడా కావచ్చు.


#SUPERWOMENలా రివార్డులు లేదా ప్రశంసలు పొందాలని ఎప్పుడూ ప్రయత్నించని స్త్రీ తనంతట తానుగా చంచలమైనది. ప్రపంచాన్ని స్వర్గంగా మార్చడంలో సహాయపడే ప్రపంచంలోని మహిళలందరికీ #మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.