బుధవారం, 16 అక్టోబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

27-08-2022 శుక్రవారం దినఫలాలు - శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో..

మేషం :- రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలకు పొట్ట, బి.పి., నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. ఊహించని సంఘటనలు వల్ల మనస్తాపం చెందుతారు. సోదరీ, సోదరులతో సంబంధ, బాంధవ్యాలు బాగుగా ఉంటాయి.
 
వృషభం :- మిత్రుల కారణంగా మీ పనులు వాయిదా వేసుకుంటారు. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యా, సంస్కృతిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ ధ్యేయం నెరవేరుతుంది.
 
మిథునం :- ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. మీ మేలు పొందినవారే మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. భార్య, భర్తల మధ్య కలహాలు, పట్టింపులు అధికమవుతాయి. ఇప్పటివరకు వాయిదా పడుతున్న వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
కర్కాటకం :- ఆర్థిక విషయాలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కుంటారు. రావలసిన బకాయిలు సకాలంలో అందినా ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోతారు. పాతమిత్రుల కలయిక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. కొంతమంది ముఖ్యమైన విషయాలలో మిమ్మల్ని సంప్రదిస్తారు.
 
సింహం :- ప్రత్తి, పొగాకు, చెరకు రైతులకు, స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. సహచరుల సహకారం వల్ల రాజకీయాలలోని వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వీలైనంత వరకు మితంగా సంభాషించండి. ఉద్యోగాభివృద్ధి కోసం చేసే యత్నం ఫలిస్తుంది. స్త్రీలకు విలాసాలు, అలంకారాలు పట్ల ఆసక్తి అధికమవుతుంది.
 
కన్య :- దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు పొరుగువారి నుంచి ఆహ్వానం అందుతుంది. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంలగాల వారికి పురోభివృద్ధి. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. ఖర్చులు చెల్లింపులు అధికంగా ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడుతాయి.
 
తుల :- కంప్యూటర్ రంగంలోని వారికి అభివృద్ధి కానవస్తుంది. రాజకీయ నాయకులు తరచూ సభ, సమావేశాలలో పాల్గొంటారు. మిమ్మల్ని పొగిడే వారి పట్ల అప్రమత్తంగా మెలగండి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన త్వరలోనే కార్యరూపం దాల్చుతుంది. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు.
 
వృశ్చికం :- దంపతుల మధ్య స్వల్ప చికాకులు, అభిప్రాయబేధాలు తలెత్తుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కొన్ని విషయాలు అంతగా పట్టించుకోవటం మంచిదికాదు. స్త్రీల సృజనాత్మకతకు, ప్రతిభకు తగిన గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
ధనస్సు :- ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. మీ కదలికలపై నిఘా ఉందన్న విషయాన్ని గమనించండి. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. సోదరీ, సోదరుల మధ్య తగాదాలు రావచ్చు. ప్రతి విషయం మీ జీవిత భాగస్వామికి తెలియజేయటం మంచిది.
 
మకరం :- ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. బంధువుల వైఖరి నిరుత్సాహ పరుస్తుంది. విద్యార్థులు క్రీడా రంగాలలో బాగా రాణిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
కుంభం :- ఒక దైవ కార్యం ఘనంగా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఇంజనీరింగ్, మెడికల్, శాస్త్రరంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం. మీ మాటకు అన్ని చోట్ల మంచి స్పందన లభిస్తుంది.
 
మీనం :- ఉచిత సలహా ఇచ్చి ఎదుటివారి ఉద్రేకానికి లోనుకాకండి. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. అప్పుడప్పుడు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు.సొంత నిర్ణయాల వల్ల కలహాలు, చికాకులు తప్పవు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల్లో వారికి మిశ్రమఫలితం.