శనివారం, 5 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2022 (20:14 IST)

రాజ‌మౌళి గురించి తెలీని ర‌హ‌స్యం మీకు తెలుసా!

Rajamouli
Rajamouli
స‌క్సెస్ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి గురించి చాలా మందికి తెలిసిందే. త‌ను ఏ ప‌నిచేసినా శిల్పి చెక్కిన‌ట్లు చెక్కుతాడు. అందుకే జ‌క్క‌న్న‌ అంటుంటారు. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు, సీరియ‌ల్‌, సినిమా ఏది తీసినా దాని గురించి క్షుణ్ణంగా ప‌రిశీలించాక ఒక‌టి రెండు సార్లు షూట్ చేసి వ‌ద్ద‌నుకుంది తీసేస్తాడు. నేడు ఆయ‌న పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి తెలుగు సినిమా చ‌రిత్ర‌ను అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ద‌ర్శ‌కుడుగా పేర్కొంటూ ఈగ‌, బాహుబ‌లి సినిమాలు లాస్ ఏంజెల్స్‌లో ప్రేక్ష‌కుల స్పంద‌న‌, అంత‌ర్జాతీయ ఫెస్టివ‌ల్‌లో ఆ సినిమాలు ప్ర‌ద‌ర్శించ‌డం గురించి చిన్న క్లిప్‌ను ఆయ‌న బృందం నేడు విడుద‌ల‌చేసింది.
 
రాజ‌మౌళి క‌ష్ట‌జీవి. అది అంద‌రికీ తెలిసిందే. కానీ అది ఒక్క ఏడాదిలోనే పేరు సంపాదించుకోలేదు. స‌క్సెస్ ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. కానీ అలాంటి ఆయ‌న‌కు తెలీని ఫెయిల్యూర్ కూడా వుంది. అవ‌న్నీ అనుభ‌వాలుగా తీసుకుని ఎదిగిన వ్య‌క్తి రాజ‌మౌళి. చాలామంది తెలీని ఓ విష‌యం ఆయ‌న‌లో దాగి వుంది కూడా. రాజ‌మౌళి సోద‌రి శ్రీ‌లేఖ సంగీత ద‌ర్శ‌కురాలు. ఆమెను హీరోయిన్‌గా చేసే ప‌నిని తొలుత రాజ‌మౌళి భుజాన వేసుకున్నారు. ఆ చిత్రం కార్య‌రూపం దాల్చి కొద్దిగా షూట్ జ‌రుపుకుంది. కానీ కొన్ని అనివార్య కార‌ణాల‌వ‌ల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆ త‌ర్వాత కొన్ని క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ చేశాడు. అక్క‌డ ఆయ‌న క్రియేటివిటీ బ‌య‌ట‌ప‌డింది. ఆ త‌ర్వాత సినిమాలు చేశాడు. కానీ సోద‌రి శ్రీ‌లేఖ హీరోయిన్ కోరిక తీర‌లేక‌పోయింది.