బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 6 అక్టోబరు 2022 (13:44 IST)

ఆర్‌.ఆర్‌.ఆర్‌. గురించి మ‌రోసారి రాజ‌మౌళి ఏం చెప్పాడంటే!

Rajamouli post
Rajamouli post
ఆర్‌.ఆర్‌.ఆర్‌. థియేట‌ర్‌లోనేకాకుండా ఓటీటీలో కూడా విడుద‌లై మంచి స్పంద‌న‌తో ర‌న్ అవుతుంది. కాగా, ఈమ‌ధ్యే ఆర్‌.ఆర్‌.ఆర్‌.ను ఆస్కార్‌కు పంపించారు. కానీ అక్క‌డ లెక్క‌ల ప్ర‌కారం ఎంపిక కాలేదు. ఇది జ‌రిగిన కొద్దికాలం అయింది. ఏమైందో ఏమో కానీ ఈరోజు రాజ‌మౌళి ప్ర‌త్యేకంగా సోష‌ల్ మీడియా ద్వారా ఈ చిత్రం గురించి స‌పోర్ట్ చేసిన‌వారికి థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ చేశాడు. 
 
ఆస్కార్స్‌లో ఇండివిడ్యువ‌ల్ కేట‌గిరిలో ఆర్‌.ఆర్‌.ఆర్‌. దరఖాస్తు చేసుకుంది.  ఈ ప్రయాణంలో తమకు మద్దతిచ్చినందుకు తారాగణం మరియు సిబ్బందికి, అభిమానులకు మరియు ప్రపంచ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ హృదయపూర్వక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నానని తెలిపారు.
 
ఇటీవ‌లే  డిజిటల్ ప్రీమియర్ గా విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ను ఆస్కార్స్ కి పంపిన విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో వెల్లడించడం జరిగింది.