శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 అక్టోబరు 2022 (12:51 IST)

రాముడు, కృష్ణుడిని చూడండి.. వాళ్లేమీ బాడీ బిల్డర్స్ కాదు.. శక్తిమాన్

adipurush movie still
"ఆదిపురుష్" టీజర్‌పై శక్తిమాన్ స్పందించాడు. ఇతిహాసగాథ రామాయణాన్ని ఇలా తీస్తే కుదరదన్నాడు. ఆది పురుష్ టీజర్‌ను చూసిన శక్తిమాన్ ముకేష్ కన్నా.. ఇటు రాముడు.. రాముడిగానూ.. అటు హనుమాన్ హనుమంతుడిగానూ కనిపించడం లేదు. 
 
దేవుళ్ళు ఎవ్వరూ ఆర్నాల్డ్ ష్వాజ్‌నెగ్గర్‌లా వుండరు. రాముడు, కృష్ణుడిని చూడండి.. వాళ్లేమీ బాడీ బిల్డర్స్ కాదు.. వాళ్ల ముఖాలు సున్నితంగా విధేయతతో వుంటాయి. కోమలమైన సౌందర్యం కలిగి వుంటారు. అంతేగానీ గడ్డాలు, మీసాలు వారికి వుండవు.. అంటూ ఘాటుగా స్పందించారు. 
 
కాగా ప్రభాస్ రాముడిగా ఓంరౌత్ రూపొందిస్తున్న మైథలాజికల్ మూవీ ఆది పురుష్ నుంచి దసరా కానుకగా విడుదలైన టీజర్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. దీనిపై బాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. 
 
మరోవైపు "ఆదిపురుష్" టీజర్‌పై వెల్లువెత్తుతున్న ట్రోల్స్‌పై చిత్ర బృందం స్పందించింది. వాటికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు నివారణ చర్యలు ప్రారంభించింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించాడు. 
 
వచ్చే ఏడాది జనవరి 12న సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల అయోధ్యలో టీజర్‌ను విడుదల చేశారు. అప్పటి నుంచి ట్రోల్స్ మొదలయ్యాయి. ఇందులోని విజువల్ ఎఫెక్ట్స్ కార్టూన్స్‌లా ఉన్నాయంటూ నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. 
 
అంతేకాదు, అందులోని విజువల్ ఎఫెక్ట్స్ రామాయణంలోని పాత్రలను అపహాస్యం చేసేలా ఉన్నాయంటూ హిందూత్వ వాదులు, పలువురు రాజకీయ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా 3డీలోనూ ‘ఆదిపురుష్’ టీజర్‌ను విడుదల చేయబోతోంది. ఈ వేడుకకు దర్శకుడు ఓంరౌత్, నటుడు ప్రభాస్ హాజరవుతారు.
 
ఈ వేడుకలో చిత్రంపై వస్తున్న విమర్శలపై వివరణ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కాగా, రామాయణాన్ని ఆధారంగా చేసుకుని రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.