బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 6 అక్టోబరు 2022 (11:52 IST)

డ్రీమ్ వారియర్స్ బేన‌ర్‌లో ఫర్హానాగా ఐశ్వర్య రాజేష్‌

Farhana, Aishwarya Rajesh
Farhana, Aishwarya Rajesh
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తమిళ చిత్ర పరిశ్రమలో వెండితెరకు చిరస్మరణీయమైన కథలను ఎంచుకుని, నిర్మించే ప్రధాన సంస్థల్లో ఒకటి. 'తీరన్ అధిగారమ్ ఒండ్రు', 'అరువి', 'ఖైదీ' వంటి చిత్రాలు వారు నిర్మించిన కొన్ని రత్నాలు. ఈ నేపథ్యంలో కంపెనీ తమ తదుపరి చిత్రాన్ని ప్రకటించింది.
 
'ఒరు ​​నాల్ కూతు', 'రాక్షసుడు' వంటి విలక్షణమైన కథాంశాలను తెరకెక్కించిన నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తోంది. బలమైన కథాంశాలకు ప్రాధాన్యతనిస్తూ చిత్రాలను ఎంచుకునే ఐశ్వర్య రాజేష్ ఇంతకుముందు చేయని పాత్రలో నటించింది. ఈ చిత్రంలో దర్శకుడు సెల్వరాఘవన్, జితన్ రమేష్, కిట్టి, అనుమోల్, ఐశ్వర్యదత్తా సహా నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
 
ఈ చిత్రానికి 'ఫర్హానా' అనే పేరు పెట్టారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పన్నయ్యరుమ్ పద్మినియుమ్, మాన్స్టర్, రచ్చసి వంటి చిత్రాలలో తన విజువల్స్‌తో తనదైన ముద్ర వేసిన గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రాఫర్. జాతీయ అవార్డు గ్రహీత సాబు జోసెఫ్ ఎడిటర్.
 
ప్రముఖ కవి, రచయిత మనుష్యపుత్రన్‌ ఈ చిత్రానికి డైలాగ్స్‌ రాశారు. రచయితలు శంకర్ దాస్ మరియు రంజిత్ రవీంద్రన్ స్క్రీన్ ప్లే కోసం దర్శకుడు నెల్సన్‌తో కలిసి పనిచేశారు. శివశంకర్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.
 
ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 7న 'ఫర్హానా' ఫస్ట్ సాంగ్ విడుదల కాబోతుంది.. తెలుగులోనూ విడుద‌ల కాబోతుంది. తప్పకుండా ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుందని టీమ్ నమ్మకంగా ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.