మంగళవారం, 12 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (14:55 IST)

ఆటో డ్రైవర్ అలా ప్రవర్తించాడు.. అలాంటి వెధవలను వదలకూడదు..

Aishwarya Rajesh
సామాన్యులనుంచి నుంచి సెలబ్రెటీల వరకు ఎక్కడపడితే అక్కడ వేధింపులకు గురవుతున్నారు. తాజాగా సినీ నటి ఐశ్వర్య రాజేష్‌కు ఆటో డ్రైవర్ వేధింపులకు సంబంధించిన ఘటనపై స్పందించింది.
 
ఒకవైపు సినిమాలతో బిజీగా వున్నా.. ఐశ్వర్య రాజేష్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఓ ఆటో డ్రైవర్‌ చేసిన పనిపై ఐశ్వర్య రాజేష్ స్పందించింది. చెన్నైలో ఉన్న ఏ.సీ.జే ఇండియా కాలేజ్‌లో జర్నలిజం కోర్సు చదువుతున్న ఇషితా సింగ్‌ అనే యువతి ఈ మధ్యనే తన ఊరికి వెళ్లి తిరిగి వచ్చింది. 
 
ఓ హోటల్ దగ్గరకు వెళ్లేందుకు తన స్నేహితురాలితో కలిసి ఆమె ఆటోను ఎక్కింది. అయితే ఆ ఆటో డ్రైవర్ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈమె శరీర భాగాలను అసభ్యంగా తాకాడు. దాంతో ఆమె అతడిపై మండిపడింది. పోలీసులకు ఫోన్ చేసే ప్రయత్నం చేయగా.. అతడు అక్కడినుంచి పారిపోయాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతడ్ని అరెస్ట్‌ చేశారు.
 
ఈ విషయంపై ఐశ్వర్య రాజేష్ స్పందిస్తూ.. '' అలాంటి వెధవలను వదలకూడదు, వెంటనే కఠినంగా శిక్షించాలి. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులకు నా కృతజ్ఞతలు. ఇషితా నువ్వు ధైర్యంగా ఉండు'' అంటూ ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చింది.