శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 అక్టోబరు 2022 (16:08 IST)

"గాడ్‌‍ఫాదర్‌"లో అంతర్లీనంగా ఆ విషయాన్ని చెప్పిన చిరంజీవి

godfather
నటీనటులు: చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, పూరీ జగన్నాథ్, సత్యదేవ్, సముద్రఖని, మురళీ శర్మ, సునీల్, బ్రహ్మాజీ
దర్శకత్వం : మోహన్ రాజా
నిర్మాతలు: రామ్ చరణ్, ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్
సంగీతం: థమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: నీరవ్ షా
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
 
కథ :
సీఎం చనిపోయాక ఆయన కుటుంబంలో అల్లుడు సత్య దేవ్ పదవికోసం వేసిన ఎత్తులు బ్రహ్మ ఉరఫ్ 'గాడ్‌ఫాదర్' (చిరు) ఏ విధంగా కంట్రోల్ చేసి ఆయన కుమార్తె నయనతారకు పట్టం కట్టాడు అన్నది కథ.
 
విశ్లేషణ : 
లూసీఫర్‌కు రీమేక్ అయినా కొంత మార్పు చేశారు. సల్మాన్ గ్యాంగ్ లీడర్‌గా చిరికు ఎలా సాయం చేసాడు. ఫైనల్‌గా చిరు మైన్డ్‌లో ఉన్న తెరవెనుక రాజకీయం ఎలా చేయాలనుంది చెప్పాడు. పవన్‌కు సపోర్టుగా నిలవాలన్నది. ఆలోచనగా సినిమా ఉంది..
కొన్ని ఎమోషనల్‌ సన్నివేశాలతో దర్శకుడు ఆకట్టకునే ప్రయత్నం చేసినప్పటికీ.. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు స్లోగా సాగుతాయి.
 
సినిమా మీద ప్రేక్షకుడికి పూర్తి స్థాయిలో ఇంట్రస్ట్ పుట్టించే స్కోప్ ఉన్నపటికీ దర్శకుడు ఆ ఎలిమెంట్స్‌ను వదిలేసి అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపేశాడు. ఊహాతీతంగా సన్నివేశాలు ఉన్నాయి. మొత్తానికి సినిమా నిండా ఎమోషన్ ఉన్నా.. ప్రేక్షకుడు ఇన్‌వాల్వ్ అయ్యే విధంగా మాత్రం, ఆ ఎమోషన్ సరిగ్గా ఎలివేట్ కాలేదు.
 
సాంకేతిక విభాగం :
దర్శకుడు మోహన్ రాజా టేకింగ్ బాగుంది. అయితే, మంచి కంటెంట్ తీసుకున్నా దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయారు. ఆయన రాసిన స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల స్లోగా సాగుతుంది. సంగీత దర్శకుడు థమన్ ఎస్ అందించిన సంగీతం ఫర్వాలేదు. ఐతే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని కీలక సన్నివేశాల్లో అక్కట్టుకున్నేలా ఉంది. నీరవ్ షా సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఇక ఎడిటర్ ఎడిటింగ్ వర్క్ కూడా ఫర్వాలేదు. నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
 
తీర్పు :
గాడ్‌ఫాదర్ చిరు స్థాయికి సరిపోయింది. బయట తను రాజకీయంగా చేయలేని పని సినిమాగా చూపాడు. నయనతార, సల్మాన్ ఖాన్ ఈ సినిమాకి ప్లస్ అయ్యారు. కానీ కొన్ని చోట్ల స్లో నేరేషన్, బోరింగ్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్‌గా ఈ పొలిటికల్ డ్రామాలో కొన్ని ఎలిమెంట్స్ మాత్రం బాగా ఆకట్టుకుంటాయి. మెగా ఫ్యాన్స్ మెచ్చే సినేమా..