బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 4 అక్టోబరు 2022 (18:22 IST)

నేను ఎప్పుడూ కొత్తదనాన్ని ఇష్టపడతానుః ది ఘోస్ట్ హీరో నాగార్జున

Nagarjuna
Nagarjuna
ది ఘోస్ట్ లో  తమహగనే వెపన్ వెనుక కథ వుంది. ఈ సినిమాలో మాత్రం వుండదు కానీ తమహగనే వెపన్ వెనుక చాలా ఆసక్తికరమైన కథ చెప్పాడు దర్శకుడు ప్రవీణ్. అది నచ్చి దాన్ని గ్లింప్స్ గా వదిలాం. ఈ సినిమా విజయం సాధిస్తే ఆ బ్యాక్ స్టొరీ కూడా చూపిస్తాం` అని  హీరో నాగార్జున అన్నారు. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుద‌ల‌కానున్న ఈ చిత్రం గురించి ఆయ‌న ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు.
 
- ది ఘోస్ట్ కథలో చక్కని ఫ్యామిలీ లైన్ వుంది. సిస్టర్, బ్రదర్ బాండింగ్ బావుంటుంది, తన సిస్టర్, ఫ్యామిలీని కాపాడటానికి హీరో చేసే పోరాటం చాలా నచ్చింది. నేను ఎప్పుడూ కొత్తదనాన్ని ఇష్టపడతాను. ప్రవీణ్ సత్తారు ఈ కథని చాలా కొత్తగా ప్రజంట్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ లు, బ్రదర్ సిస్టర్ బాండ్ ని అద్భుతంగా చూపించారు. సినిమా చూసిన తర్వాత షాక్ అయ్యాను. ప్రవీణ్ చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు. చాలా ఇంప్రస్ అయ్యాను. ఒక యాక్షన్ మూవీ లో ఎమోషన్ ఈ స్థాయిలో పండటం నాకే షాక్ అనిపించింది. ప్రేక్షకులు కూడా సినిమా చూసి బయటికి వచ్చినపుడు యాక్షన్ విషయంలో ఒక షాక్ ఫీలౌతారు. సినిమా చాలా కొత్తగా వుంటుంది.  ఇందులో క్లైమాక్స్ చర్చ్ ఫైట్ ఒక మెయిన్ హైలెట్. 
 
ది  ఘోస్ట్ ని శివతో పోల్చడానికి కారణం ?
నిజానికి ఈ సినిమా కథ విన్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ ఆ పోలిక రాలేదు. సినిమా చూస్తున్నపుడు మాత్రం శివ లాంటి ఫ్యామిలీ ఎమోషన్ వుందనిపించింది.
 
ది ఘోస్ట్ కథని ఎంచుకోవడానికి కారణం ?
నేను చాలా యాక్షన్ మూవీస్ చేశాను. కానీ ఎమోషన్ తో కూడిన ఒక స్టయిలీష్ యాక్షన్ సినిమా చేయాలని వుండేది. గరుడ వేగ లో ప్రవీణ్ సత్తారు యాక్షన్ చాల నచ్చింది. ప్రవీణ్ ని పిలిచి మంచి యాక్షన్ మూవీ చేద్దామని చెప్పాను. అప్పుడు నన్ను మైండ్ లో పెట్టుకొని ది ఘోస్ట్ కథని తయారు చేసారు. ఈ సినిమాలో యాక్షన్ కోసం మూడు వారాల శిక్షణ కూడా తీసుకున్నాం.
 
మీరు చిరంజీవి గారి సినిమాలు ఒకే రోజు వస్తుంటే ఇద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారనిపిస్తుంది ?
మేము మంచి స్నేహితులం. రెండు సినిమాలు విడుదలై విజయం సాధించిన సందర్భాలు అనేకం వున్నాయి. సినిమా బావుంటే ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారు. శివ సినిమా అక్టోబర్ 5నే వచ్చింది. నిన్నే పెళ్ళాడుతా అక్టోబర్ 4న వచ్చిందని ఒక అభిమాని ఫోన్ చేసి చెప్పారు. ది ఘోస్ట్ అక్టోబర్ 4నే  యుఎస్ లోరిలీజ్ అవుతుంది. ఈ రకంగా నిన్నే పెళ్ళాడుతా సెంటిమెంట్ కూడా కుదిరింది.
 
పాత సినిమాలని కొత్తగా రిలీజ్ చేసే ట్రెండ్ నడుస్తుంది.. శివ సినిమా మళ్ళీ వస్తుందా ?
తప్పకుండా. శివ సినిమాని 4కే డిజిటల్ చేస్తున్నాం. అదే కాదు అన్ని సినిమాలు డిజిటల్ చేయాలి. కొన్ని నెగిటివ్ లు పాడయ్యాయి. ప్రస్తుతం దానికి సంబధించిన పనులు జరుగుతున్నాయి.
 
మీరు బాలీవుడ్ లో చేస్తున్నారు.. సల్మాన్ ఖాన్ లాంటి నటులు ఇక్కడ సినిమాలు చేస్తున్నారు.. బౌండరీలు చేరిగిపోయాయని అనుకోవచ్చా ?
ఇప్పుడు బౌండరీలు లేవు. యుఎస్ లో ఐమాక్స్ స్క్రీన్ లో ఆర్ఆర్ఆర్ వచ్చిన రెస్పాన్స్ వీడియో చూస్తే దేశంలోనే కాదు ప్రపంచ సరిహద్దులు కూడా చెరిగిపోయాయని అనిపించింది. బ్రహ్మాస్త్రలో నేను చేసిన పాత్రకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
కొత్తగా చేయబోయే సినిమాలు ?
రెండు మూడు కథలు చర్చలో వున్నాయి. యాక్షన్ డ్రామా జోనర్ లో వుంటాయి. అలాగే వెబ్ సిరిస్ చర్చలు కూడా నడుస్తున్నాయి.