1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 4 అక్టోబరు 2022 (14:10 IST)

ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి నాయ‌కుడు మ‌న‌కు రావాలిః మెగాస్టార్ చిరంజీవి

Pawan Kalyan, Megastar Chiranjeevi,
Pawan Kalyan, Megastar Chiranjeevi,
త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను చిన్న‌ప్ప‌టినుంచి గ‌మ‌నిస్తున్నా. త‌మ్ముడు నిబ‌ద్ధ‌త‌, నిజాయితీ వున్న వ్య‌క్తి. త‌ను రాజ‌కీయ పార్టీ పెట్టాక నేను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నా. అంతేకానీ నేను ఏ రాజ‌కీయ పార్టీలోనూ చేర‌డంలేదు. గ‌తంలో నేను త‌మ్ముడు పార్టీకి స‌పోర్ట్ చేస్తా. మ‌రో పార్టీకి చేయ‌ను అని చెప్పిన‌ట్లు నాకు గుర్తు లేదు. త‌మ్ముడు ఎక్క‌డా పొల్యూట్ కాలేదు. అలాంటి నాయ‌కుడు మ‌న‌కు రావాలి అని మెగాస్టార్ చిరంజీవి స్ప‌ష్టం చేశారు.
 
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన గాడ్ ఫాద‌ర్ ప్ర‌మోష‌న్‌లో రాజ‌కీయాల గురించి ప్ర‌స్తావ‌న రాగా చిరంజీవి పై విధంగా స్పందించారు. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ, నేను రాజ‌కీయాల‌నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే త‌మ్ముడు పెట్టిన పార్టీకి హెల్ప్ అవుతుంద‌నే అనుకున్నాను. గాడ్ ఫాద‌ర్‌లోనూ రాజ‌కీయాకూ దురంగా లేను అనే డైలాగ్ కూడా సంద‌ర్భానుసారంగా రాసిందే కానీ. నేను మ‌ళ్ళీ వ‌స్తాన‌ని కాదు. కె.సి.ఆర్‌, వై.ఎస్‌. జ‌గ‌న్‌, మోదీని క‌లిసినా ఎటువంటి రాజ‌కీయ ప్ర‌స్తావ‌న‌రాలేదు అని తెలిపారు