గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 1 అక్టోబరు 2022 (15:39 IST)

అల్లు స్టూడియోస్ లాభాపేక్షా కోసం కాదు, స్టేటస్ సింబల్ః మెగాస్టార్ చిరంజీవి

allu arjun, chiru, aravind
allu arjun, chiru, aravind
నేడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి శత జయంతి సందర్భంగా  అల్లు అరవింద్ నేతృత్వంలో, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా అల్లు కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌లో  కొత్త ఫిల్మ్ స్టూడియో - "అల్లు స్టూడియోస్‌" ను ప్రారంభించారు. ఈ శతజయంతి వేడుకలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్,పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్,అల్లు శిరీష్ మరియు మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.
 
ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... మా మామయ్య గారు శతజయంతి సందర్బంగా ముందుగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఎంతోమంది నటులు ఉన్న కొందరికి మాత్రమే ఈ రకమైన ఆత్మీయత,అభిమానం లభిస్తుంది.రామలింగయ్య గారు వేసిన బాటలో అల్లు అరవింద్ గారు నిర్మాతగా, అల్లు అర్జున్,అల్లు శిరీష్ నటులుగా ఈరోజు అగ్రస్థానంలో ఉన్నారంటే దానికి కారణం కొన్ని దశాబ్దాలు క్రితం అల్లు రామలింగయ్య మదిలో నటుడిగా నిలద్రొక్కుకోవాలి అనే ఒక ఆలోచన. అల్లు అరవింద్ గారిని నిర్మాతను చెయ్యాలని గీతా ఆర్ట్స్ స్థాపించారు. అలానే అల్లు బాబీ,అల్లు అర్జున్,అల్లు శిరీష్ ఈ రోజు ఈ స్థాయిలో నిలద్రొక్కుకున్నారంటే మీరందరూ ఆయనను తలుచుకోవాలి,ఆయనకు నివాళులు అర్పించుకోవాలి.అల్లు స్టూడియోస్ లాభాపేక్ష కోసం చేసింది అని నేను అనుకోవట్లేదు,ఇది ఒక స్టేటస్ సింబల్. ఇది అల్లు రామలింగయ్య గారికి ఘనమైన గుర్తింపు. అల్లు రామలింగయ్య గారి కృతజ్ఞతను తీర్చుకోవడం కోసమే దీనిని నిర్మించారు. ఈ రకమైన ప్రయత్నం చేసినందుకు అల్లు అరవింద్ గారికి, అల్లు అర్జున్ కు,శిరీష్ కు, బాబీ కు నా అభినందనలు.
 
అగ్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మా నాన్నగారు చనిపోయి సుమారు 18 సంవత్సరాలు అయింది.కానీ ఇప్పటికీ ప్రతీ ఇంటా ఒక ఈటీవీ లోనో,జెమిని టీవీలోనో కనిపిస్తారు.ఇంకా స్టూడియో అనేది ఎంత లాభాన్ని తీసుకొస్తుంది, ఎంత వ్యాపారం అనే దృక్పథంతో కట్టలేదు.ఈ  స్టూడియో తరాలుగా ఉండిపోయే ఒక జ్ఞాపిక,ఇది ఒక సొంత స్పెసిలిటీ, ఇకపై స్టూడియో కాని గీతా ఆర్ట్స్ కాని పైనుంచి చూస్తాను తప్ప ఈ బాధ్యతలను నా తరవాత తరానికి అప్పగిస్తాను.వీరంతా దీనిని దిగ్విజయంగా నడిపిస్తారు అని ఆశిస్తున్నాను.
 
నాన్నగారు ప్రేమ చూస్తే నాకు ముచ్చటేస్తుంది.
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ... ముందుగా మెగాస్టార్ చిరంజీవిగారికి తన తరుపున,అల్లు కుటుంబం తరుపున కృతజ్ఞతలు తెలిపారు. అందరూ అనుకోవచ్చు అల్లు అరవింద్ గారికి గీతా ఆర్ట్స్ బ్యానర్ ఉంది,వాళ్లకి పెద్ద ల్యాండ్ ఉండి ఉంటుంది. వాళ్ళకి స్టూడియో పెట్టడం పెద్ద విశేషం కాకపోవచ్చు అని మీరు అనుకోవచ్చు, కానీ ఈ స్టూడియో పెట్టిన పర్పస్ మాకేదో కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందని కాదు, ఈ స్టూడియోస్ పెట్టడానికి కారణం ఇది మా తాతయ్య గారి కోరిక, ఆయన జ్ఞాపకంగా ఇది నిర్మించాం.ఇక్కడ మంచి మంచి సినిమాలు షూటింగ్ జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.మాములుగా ఫాథర్ చనిపోతే కొన్నేళ్ళు పూజ చేస్తారు, రోజులు మారే కొద్దీ చనిపోయిన వాళ్ల మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళు గుర్తుంటారు కానీ ముందుగా చేసినంత భారీస్థాయిలో మళ్ళీ మళ్ళీ ఫంక్షన్ లు చెయ్యరు.కానీ మా నాన్నగారు సంవత్సరాలు గడుస్తున్నా కొద్దీ ఇంకా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తున్నారు,మా నాన్నగారు వాళ్ళ నాన్నగారిని ఇంతలా ప్రేమిస్తున్నారు అని చూస్తే నాకు ముచ్చటేస్తుంది.వాళ్ళ నాన్నని అంతగా ఇష్టపడే మా నాన్నగారికి నా అభినందనలు. అలానే ముఖ్యంగా కొన్ని దశాబ్దాలుగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నా మెగా అభిమానులకు, నన్ను ప్రేమించే నా ఆర్మీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు,అలానే ఇక్కడ ఉన్న ప్రతీ ఒక్కరికీ,అలానే మీడియాకు,పోలీస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.