నయనతార కేరెక్టర్ ఎలాంటిదో బయటపెట్టిన నిర్మాత
తమిళ నటి నయనతార గురించి అందరికీ తెలిసిందే. రజనీకాంత్ నటించిన చంద్రముఖితో వెలుగులోకి వచ్చిన నయనతార అప్పటినుంచి కెరీర్‌ను వెనక్కు తిరిగి చూసుకోలేదు. అయితే నయనతార ఏ సినిమా చేసినా తెలుగులో ప్రమోషన్ చేయడంలేదని నిర్మాతలు పలువురు ఛాంబర్‌ముందు ఏకరువు పెట్టిన సందర్భాలున్నాయి. అయితే ముందుగా రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఆమె సినిమా షూట్ అయ్యాక ప్రమోషన్‌కు రాదనేది అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్‌లో నటించింది. ఆమె స్టిల్స్ బయటకు వచ్చాయి కూడా.
ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చారనే టాక్ కూడా వుంది. ఇక ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎన్.వి.ప్రసాద్ షూటింగ్ గురించి చెబుతూ, నయనతార వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పాడు. ఆమె ఈ సినిమాలో నటించడానికి కారణం దర్శకుడు మోహన్ రాజా మాత్రమే. ఆమెతో గతంలో ఆయన తీసిన సినిమాల వల్లే ఇది సాధ్యమయింది. ఈ తరుణంలో సినిమాలో ఓ సీన్ చేయాలి. గంటపాటు ఆమె పాల్గొంటే చాలు. అప్పటికే షూటింగ్ అంతా అయింది. ప్యాచ్ వర్క్ వుంది. ఆమెను దర్శకుడు పిలిస్తే వచ్చి యాక్ట్ చేసింది. దాదాపు మూడు గంటల ఆమె వుంది. షాట్ పూర్తయ్యాక తను వెళ్ళిపోయింది. పైసా కూడా అడగలేదు. ఆమె టీమ్ నుంచి డబ్బు విషయంలో చర్చేరాలేదు. ఇది ఆమె డిడికేషన్‌కు నిదర్శనం. ఇక ఆ తర్వాత ఆమె అడగకపోయినా నిర్మాత మేము కొంత మొత్తాన్ని ఇవ్వడం జరిగింది అని క్లారిటీ ఇచ్చారు.