మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 అక్టోబరు 2022 (12:49 IST)

తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్.. 100కు కాల్ చేయండి

Rains
తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం ప్రజలు డయల్ 100కు కాల్ చేయాలని తెలిపారు.
 
మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, మంచిర్యాల, కరీంగనర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా.. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 
 
అక్టోబర్ ఆరో తేదీ నుంచి 12వ తేదీ వరకు ఆరు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.