సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 23 అక్టోబరు 2022 (17:09 IST)

మహిళకు కాషాయ మంత్రి చెంపదెబ్బ.. బొమ్మై ఈ మంత్రిపై వేటు వేస్తారా ..? (video)

V Somanna
V Somanna
కర్ణాటక గృహ నిర్మాణ శాఖ మంత్రి వి సోమన్న ఓవరాక్షన్ చేశారు. ఓ మహిళపై చేజేసుకున్నాడు. ఆమెను చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే.. చామరాజనగర్‌ గుండ్లుపేట్‌లో మహిళ పట్ల కాషాయ మంత్రి సోమన్న దురుసుగా ప్రవర్తించడంపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. 
 
మహిళ పట్ల అనుచితంగా వ్యవహరించిన మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఈడబ్ల్యూఎస్‌ ఇళ్ల పత్రాలు ఇస్తున్న క్రమంలో సాయం కోసం అభ్యర్థించిన మహిళపై అసహనానికి లోనైన మంత్రి చెంపదెబ్బ కొట్టారు. 
 
కర్నాటకలో బీజేపీ మంత్రులు, నేతలకు అహంకారం నెత్తికెక్కిందని ఇంత జరిగినా ప్రధాని ఎక్కడున్నారు… బొమ్మై ఈ మంత్రిపై వేటు వేస్తారా ..? అంటూ కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సుర్జీవాలా ట్వీట్‌లో నిలదీశారు.