మంగళవారం, 31 జనవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated: బుధవారం, 9 నవంబరు 2022 (12:43 IST)

హాల్ టిక్కెట్‌పై సన్నీలియోన్ చిత్రం.. షాకైన స్టూడెంట్ - విచారణకు ఆదేశం

Sunny leoen photo
నవంబర్ 6న జరిగిన కర్ణాటక టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET-2022)కి హాజరైన అభ్యర్థి హాల్ టికెట్‌పై బాలీవుడ్ నటి సన్నీ లియోన్ చిత్రం ముద్రించబడింది. ఈ ఫోటో ప్రస్తుతం సంచలనం రేపింది. దీనిపై విచారణ జరిపిన తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని కర్ణాటక విద్యాశాఖ ఆదేశించింది. 
 
అడ్మిట్ కార్డు స్క్రీన్ షాట్ వైరల్ కావడంతో విద్యాశాఖ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. రుద్రప్ప కాలేజీలో ఓ అభ్యర్థి తన హాల్‌టికెట్‌తో సన్నీ లియోన్ బొమ్మను ప్రదర్శించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది, ఆ తర్వాత సంస్థ ప్రిన్సిపాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామక పరీక్ష రాయడానికి ఒక యువతి దరఖాస్తు చేసుకుంది. పరీక్ష ముందు హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న ఆ యువతి దానిపై ఉన్న ఫొటోను చూసి ఒక్కసారిగా అవాక్కయింది.
 
ఆ హాల్ టికెట్‌పై తన ఫొటోకు బదులుగా ఫేమస్ సినీ స్టార్ సన్నీ లియోన్ ఫోటో ఉంది. అది కూడా అసభ్యకరంగా ఉంది. దీన్ని ఆ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా అది వైరల్ అయింది. దాంతో, ప్రభుత్వంపై విమర్శల వర్షం ప్రారంభమైంది. 
 
ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ప్రభుత్వ తీరు ఇలా ఉందంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. కర్నాటక విద్యా శాఖ అసమర్ధతపై నిప్పులు చెరిగింది. దాంతో, కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. దీనిపై కర్ణాటక విద్యా శాఖ వివరణ ఇచ్చింది. దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థి ఏ ఫొటో అప్ లోడ్ చేస్తే అదే ఫొటో ఆటోమేటిక్‌గా హాల్ టికెట్‌పై ప్రింట్ అవుతుందని వివరించింది. 
 
దరఖాస్తు సమయంలో కావాలనో, లేక పొరపాటునో సన్నీ లియోన్ ఫొటో అప్‌లోడ్ అయి ఉండవచ్చని పేర్కొంది. మొత్తం ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించింది.