నేను ఈరోజు కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను : అల్లు అర్జున్
Allu Arjun, Allu Aravind, Shirish
Allu Arjun, Allu Aravind, Shirish and ohters
అల్లు శిరీష్ మాట్లాడుతూ, సినిమా రిలీజ్ అయ్యాక రివ్యూస్ చూసి చాలా హ్యాపీ అనిపించింది. కొన్ని సంవత్సరాలు తరువాత వెనక్కు తిరిగి చూసుకుంటే అనుకి ఈ సినిమా స్వీట్ మెమరీలా ఉంటుంది. మా నాన్నగారు నాకు చాలా ఇచ్చారు. అరవింద్ గారి అబ్బాయిగా పుట్టడం నా అదృష్టం. బన్నీ నన్ను ఎప్పుడు తమ్ముడులా చూడడు కొడుకులా చూస్తాడు. ఇప్పటికి నన్ను ఒక చిన్న పిల్లాడిలా చూస్తాడు. సోషల్ మీడియాలో పోస్ట్స్ పెట్టిన కూడా మై బేబీ సిరి అంటాడు. అలానే సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
చిత్ర దర్శకుడు రాకేష్ శశి మాట్లాడుతూ, బన్నీ సర్ మీరు గంగోత్రి సినిమాతో మొదలుపెట్టి ఇప్పుడు పుష్ప సినిమాతో ప్రపంచం మొత్తం మీ వైపు చూసేలా సాగింది మీ జర్నీ.మీకు చాలామంది అభిమానులు ఉన్నారు , ఆర్మీ ఉంది. మాకు మీరంటే గౌరవం సర్. ఈ సినిమా విజయాన్ని శిరీష్ ఫ్యాన్స్ కి అంకితం చేస్తున్నాను. ఈ సినిమాలో శిరీష్ గారి క్యారెక్టర్ కి, నిజ జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన చాలా నేచురల్ గా నటించారు అంటే, అది ఆయన పెట్టిన ఎఫర్ట్. అల్లు అరవింద్ గారు నాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు.ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
అను ఇమ్మాన్యూల్ మాట్లాడుతూ..బన్నీ వాసు గారు ఈ సినిమా కోసం ముందు నన్ను అప్రోచ్ అయ్యి కన్విన్స్ చేసారు. ఈ సినిమాను అర్ధం చేసుకున్న ప్రేక్షకులకు థాంక్యూ సో మచ్. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.
నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ, ఈ సంస్థలో 60 ఏళ్ళ కుర్రాడు అల్లు అరవింద్ గారు. ఆయనను చూసి ఎప్పుడూ ఇన్స్పైర్ అవుతుంటాం.ఈ సక్సెస్ ను శిరీష్ కంటే నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను. నేను ఈ పొజిషన్ లో ఉండటానికి శిరీష్ కారణం. సో తన సినిమా ఏదున్నా అది సక్సెస్ చెయ్యడానికే ప్రయత్నిస్తాను. అను ఇమ్మన్యుల్ మా సంస్థ మీద నమ్మకంతో ఈ సినిమా చేసారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ నా జీవితంలో ఆయనే ఉన్నారు, నేనే ఆయన, ఆయనే నేను. నన్ను ఎవరైనా ఎంత సంపాదించావు అంటే చాలా సంపాదించాను చెప్తాను, ఎందుకంటే ఆయన సంపాదించింది అంతా నాదే. ఏమి సాధించవు అంటే చాలా సాధించా అని చెప్తా ఎందుకంటే ఆయన సాధిస్తే నేను సాధించినట్టే. థాంక్యూ సో మచ్.

