పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ అలియా భట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్.. పండింటి బిడ్డకు జన్మనిచ్చారు. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ - అలియా భట్ దంపతులకు ఆదివారం ఆడబిడ్డ జన్మించింది. ముంబైలోని హెచ్.ఎన్.రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో ఆలియా భట్ ప్రసవించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగానే ఉన్నారు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు ఆస్పత్రిలో చేరిన అలియా భట్‌కు వైద్యులు పరీక్షించి వైద్యం చేశారు. ఆ సమయంలో తన భార్య వెంట హీరో రణ్‌బీర్ కపూర్ కూడా ఉన్నారు.
కాగా, రణ్‌బీర్ కపూర్, అలియా భట్‌లు గత కొంతకాలం డేటింగ్‌లో ఉన్న విషయం తెల్సిందే. ఈ యేడాది ఏప్రిల్ 14వ తేదీన వారు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రెండు నెలలకు గర్భధారణ విషయాన్ని అలియా తన ఇన్‌స్టాఖాతాలో వెల్లడించారు.
మరోవైపు బిడ్డకు జన్మనిచ్చిన అలియా భట్‌కు సినీ ప్రముఖులతో పాటు ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్ తెలుగు ప్రేక్షకులను పలుకరించిన విషయం తెల్సిందే.