గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 1 నవంబరు 2022 (11:33 IST)

బాలకృష్ణతో గీతా ఆర్ట్స్‌ చిత్రం త్వరలో ప్రారంభం?

Nandamuri Balakrishna
Nandamuri Balakrishna
నందమూరి బాలకృష్ణ హీరోగా గీతా ఆర్ట్స్‌ బేనర్‌లో చిత్రం చేయడాఁకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే అల్లుఅరవింద్‌ పార్టనర్‌గా వున్న ఆహా! అనే ఓటీటీలో అన్‌ స్టాపబుల్‌ షోకు  బాలకృష్ణ హోస్ట్‌గా వున్నారు. అది చాలా సక్సెస్‌ అయింది. అదే స్పూర్తితో రెండో భాగం కూడా సిద్ధమైంది. అయితే ఎప్పటినుంచో అల్లు అరవింద్‌ బాలయ్యతో సీనిమా చేయాలనుకఁంటున్నారు. అది ఇప్పుడు కార్యరూపం దాల్చినట్లు తెలుస్తోంది. 
 
అఖండతో పాన్ ఇండియా స్టార్గా బాలయ్యకు గుర్తిమ్పు వచిన్ది. మరో వైపు మలినేని గోపీచంద్ సినిమా చేస్తున్నారు బాలయ్య. అందుకే పాన్ ఇండియా లెవెల్ లో కథ ఉండేలా ర్రాసుకుని పరశురామ్‌ దర్శకత్వం వహించడం విశేషం. మహేష్‌బాబుతో సర్కారువారి పాట చేసిన ఆయన గీత గోవిందం వంటి హిట్‌ చిత్రాన్నీ గీతా ఆర్ట్స్‌కు ఇచ్చారు. ఇక పరశురామ్‌ బాలయ్యబాబుకు  తగిన కథను రాసుకఁఁ బాలయ్యబాబుకు వినిపించినట్లు తెలిసింది. ఈ కార్తీకమాసంలోనే ఇందుకు  సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.