వీరసింహారెడ్డి కోసం భారీ ఫైట్ సన్నివేశాల చిత్రీకరణ
నటసింహ నందమూరి బాలకృష్ణ, గోప్‌చంద్ మలినేనిల మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి టైటిల్ పోస్టర్ తో అందరినీ అలరించింది. బాలకృష్ణకు వీరాభిమాని అయిన గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ, విలన్ బ్యాచ్ పై ఉత్కంఠభరితమైన భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. కథలో కీలకమైన సమయంలో రానున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ ని దర్శకుడు అద్భుతమైన రీతిలో తెరకెక్కిస్తున్నారు. ఫైట్ మాస్టర్ వెంకట్ ఫైట్ సీక్వెన్స్‌ని పర్యవేక్షిస్తున్నారు. సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ చిత్రం కథ యదార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై భారీ ఎత్తున రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరసింహారెడ్డి 2023 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సంగీత సంచలనం ఎస్ థమన్ ఈ చిత్రానికిసంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.