గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2022 (16:44 IST)

నేను తొందరపడి నిర్ణయాలు తీసుకోనుః బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నందమూరి బాలకృష్ణ

Jyoti prajvalana by balakrishna
Jyoti prajvalana by balakrishna
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృ తన తొలి బ్రాండ్ కమర్షియల్‌ తో అడ్వర్టైజింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. బాలకృష్ణ తన స్టార్ ‌డమ్‌ కి తగ్గ బ్రాండ్‌ని ఎంచుకున్నారు. సాయి ప్రియా గ్రూప్ వెంచర్ అయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్- 116 పారామౌంట్‌ కి బ్రాండ్ అంబాసిడర్‌ గా ఆమోదం తెలిపారు బాలకృష్ణ. సాయి ప్రియా గ్రూప్ సౌత్ ఇండియా బెస్డ్ నిర్మాణ, ప్లాటింగ్ సేవల అందించే విభిన్న మార్కెట్ విభాగాలలో ప్రముఖ బిల్డర్. వారు అందించే రీగల్ శ్రేణి ప్రాజెక్ట్‌లకు సరిపోయేలా, వారు తమ బ్రాండ్‌ ను ఎండోర్స్ చేయడానికి లయన్ నందమూరి బాలకృష్ణను తీసుకున్నారు.
 
Nandamuri Balakrishna, Saikrishna, Murali Mohan etc
Nandamuri Balakrishna, Saikrishna, Murali Mohan etc
బాలకృష్ణ నటించిన రెండు కమర్షియల్ యాడ్స్ విడుదలయ్యాయి. రెండు యాడ్ల కాన్సెప్ట్‌ లు యునిక్ గా ఆకర్షణీయంగా వున్నాయి. బాలకృష్ణ రెండు విభిన్న గెటప్‌లలో మెరిశారు. సూట్ ‌లలో క్లాస్ అప్పియరెన్స్, కుర్తా పైజామాలో సాంప్రదాయకంగా కనిపించి ఆకట్టుకున్నారు. మొదటి యాడ్‌లో బాలకృష్ణ రాయల్ అవతార్ లో కనిపిస్తుండగా, రెండో యాడ్‌లో సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా కనిపించారు. రెండూ చాలా మంచి కాన్సెప్ట్స్, అందరిదృష్టిని ఆకర్షించాయి. ఇండియన్స్ ఇల్లు కొనడం చాలా పెద్ద నిర్ణయం. నివాస గృహాన్ని కొనుగోలనేది చాలా భావోద్వేగాలు, సెంటిమెంట్ తో కూడుకున్నది. రెండవ ప్రకటన ద్వారా ఇదే విషయాన్ని తెలియజేశారు. బాలకృష్ణ తనదైన డైలాగ్ డెలివరీతో చాలా గ్రేస్‌ ఫుల్ గా ఆకట్టుకున్నారు. బాలకృష్ణ కూతురుగా బేబీ ఆదిశ్రీ గండ్ర కనిపించింది. ఆనంద్ గుర్రాన్ రెండు వాణిజ్య ప్రకటనలకు రచన,  దర్శకత్వం వహించగా, సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ, యశ్వంత్ నాగ్ సంగీతం అందించారు. శ్రేయాస్ మీడియా  Brand'E సహకారంతో ఈ కమర్షియల్ యాడ్స్ ని సమన్వయం చేసింది.
 
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ “చాలా మంది వివిధ బ్రాండ్ లను ప్రమోట్ చేస్తుంటే నేను ఎందుకు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ చేయడం లేదని నా అభిమానులు నిరాశపడిన సందర్భాలు వున్నాయి. నేను ఎప్పటికీ బ్రాండ్ ‌లని ఎండార్స్ చేయనని  నిర్ధారణ చేసినవారూ వున్నారు. యాదృచ్ఛికంగా 'ఆహా'లోని అన్‌స్టాపబుల్ టాక్  షోతో ఓటీటీ అరంగేట్రం చేసాను. అది దేశంలోనే నెంబర్ వన్ షో గా విజయవంతమైయింది. ఇప్పుడు నేను అడ్వర్టైజింగ్ ప్రపంచంలోకి  అడుగుపెడుతున్నాను. నేను తొందరపడి నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని కాదు. నేను ఏదైనా సంతకం చేస్తే నమ్మదగిన బ్రాండ్  గా వుండాలి. సాయి ప్రియా గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందుకు గర్వంగా భావిస్తున్నాను. అఖండ షూటింగ్‌ లో ఉన్నప్పుడు శ్రేయాస్ శ్రీనివాస్ నన్ను సంప్రదించారు. హైదరాబాద్ శివార్లు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి చేస్తోంది. దేశంలోనే హ్యాపనింగ్ సిటీ హైదరాబాద్. రీజనల్ రింగ్ రోడ్డు కూడా రానుంది. గొప్ప మెట్రోపాలిటన్ నగరంగా మారుతోంది. జూబ్లీహిల్స్‌లో నా ఇల్లు కట్టినప్పుడు, అప్పట్లో రోడ్లు లేవు.  కానీ ఇప్పుడు అది నగరానికి కేంద్రంగా మారింది. మా ఇంటి డిజైన్ కూడా మా నాన్నగారు ఇచ్చిందే. నమ్మకం, నాణ్యత. నవ్యత, నిబద్దత.. ఇవన్నీ కలగలిపిన సంస్థ మన సాయి ప్రియా గ్రూప్.  4000 ఎకరాలకు పైగా భూమిని అభివృద్ధి చేయడం ద్వారా సాయిప్రియ తన మైల్ స్టోన్ని క్రియేట్ చేసింది. వీరికి 26 సంవత్సరాల అనుభవం ఉంది. 36 ప్రాజెక్ట్‌లను పూర్తి చేశారు. రాబోయే రోజుల్లో వారు మరిన్ని విజయాలు సాధిస్తారని ఆశిస్తున్నాను'' అని కోరారు.
 
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయికృష్ణ మాట్లాడుతూ.. ''గత 26 ఏళ్లలో సాయి ప్రియా గ్రూప్ వివిధ ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది. అయితే, హైదరాబాద్‌ లో కొత్త ప్రాజెక్ట్ చాలా లగ్జరీగా ఉండాలని మేము కోరుకున్నాము. మేము ఇంతకు ముందు మా బ్రాండ్‌ ను ప్రచారం చేయలేదు , బ్రాండ్ అంబాసిడర్ కూడా లేరు.  అఖండ టైటిల్స్ స్పాన్సర్ చేశాం. ఆ సమయంలో 'అఖండ టీమ్‌ తో చర్చించాము. కాని బాలకృష్ణ గారు ప్రతిపాదనకు అంగీకరిస్తారా లేదా అనే సందేహం వుండేది. అయితే  బాలకృష్ణ గారి నుండి మాకు కాల్ వచ్చింది, మా కొత్త వెంచర్‌ ను ఎండార్స్ చేయడానికి అంగీకరించారు. ఈ నెల 17న ఆయన్ను కలిశాను, 26వ తేదీలోగా యాడ్ సిద్ధంగా ఉంది. దీనికి సహకరించిన  సాయి ప్రియ టీమ్, శ్రేయాస్ మీడియా టీం,  డైరెక్టర్ ఆనంద్ గుర్రామ్ కి ధన్యవాదాలు.  బాలకృష్ణ తొలిసారి యాడ్ చేస్తున్నారు ఎక్కడా తగ్గకుండావుండాలని టీంతో చెప్పాను. బాలకృష్ణ గారి మనసు బంగారం. ప్రొఫెషనలిజం, క్రమశిక్షణలో దేశం మొత్తంలో ఆయనకీ ఎవరూ సరిపోరు. మా చైర్మన్  ప్రసాద్ గారు ఒక లెజెండ్. బాలయ్య గారు మరో లెజెండ్. ఇద్దరు లెజెండ్స్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రాజెక్ట్ ఇది’ అని అన్నారు.