ఊర్వశివో రాక్షసివో మూవీ రివ్యూ
నటీనటులు: అల్లు శిరీష్-అను ఇమ్మాన్యుయెల్-వెన్నెల కిషోర్-అనీష్ కురువిల్లా-పోసాని కృష్ణమురళి-ఆమని-కేదార్ శంకర్ తదితరులు
సాంకేతికత- సంగీతం: ఛాయాగ్రహణం: తన్వీర్ మీర్, ఆచ్చు రాజమణి-అనూప్ రూబెన్స్, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాతలు: ధీరజ్ మొగిలినేని-విజయ్, రచన-దర్శకత్వం: రాకేశ్ శశి.
అల్లు శిరీష్ కొత్తజంట సినిమాతో మంచి నటుడిగానే ప్రూవ్ చేసుకున్నాడు. 'శ్రీరస్తు శుభమస్తు' వంటి సినిమాలు చేసిన మంచి బ్లాక్బూస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా 'ఊర్వశివో రాక్షసివో' చిత్రంతో అది పూర్తి చేయాలనే కసితో చేసాడు. మరి ఆ సినిమా ఈరోజే విడుదల అయింది. అది ఎలా ఉందొ చూదాం.
కథ:
శ్రీ (అల్లు శిరీష్) మధ్య తరగతి కుర్రాడు. పెద్దలంటే గౌరవం. అమాయకుడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూన్నా ఈనాటి ఫాస్ట్ జనరేషన్ కాదు. అలాంటి అతను సింధు (అను ఇమ్మాన్యుయెల్)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అనుకోకుండా ఆ అమ్మాయి తన ఆఫీసులోనే కలీగ్ అవుతుంది. ఆమెతో పరిచయం ప్రేమగా భావిస్తాడు. కానీ తాను అమెరికా నుంచి రావడంతో అక్కడి కల్చర్ అలవాటుతో ప్రేమ, పెళ్లిని సీరియ్సగా తీసుకోదు. సహజీవం కోరుకుంటుంది. బలవంతంగా శ్రీని ఒప్పించి లివింగ్ రిలేషన్ కొనసాగిస్తారు. ఓరోజు శ్రీ తల్లికి సీరియస్ గా ఉందని చెప్పినా తన ఎయిమ్ కోసం సింధు ఆలోచన ధోరణి మారదు. దాంతో శ్రీ ఎటువంటి స్టెప్ తీసుకున్నాడు. తర్వాత ఏఁయింది అనేదే కథ.
విశ్లేషణ:
కొన్నేళ్లుగా జనేషన్ గాప్ తో కథలు వస్తున్నాయి. అలంటి సినిమానే ఇది. నేటి తరం తాము ఎదో సాధించాలని పెళ్లికి దూరంగా సహజీవం దగ్గరగా వస్తున్నారు. వాటిల్లో చాలావరకు ఫెయిల్ అవుతున్నాయి. ఏది ఏమైనా సహజీవం ఆలోచన ఉన్నవారు ఎలాంటి తప్పు చేస్తున్నారు అనేది ఇందులో చూపించారు. పెళ్ళి చేసుకుంటే తాము అనుకున్న కెరీర్ పోయింది అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అల్లాగే పెళ్ళి చూసుకున్నాక కెరీర్ విజయవంతం చేసుకున్నవారూ ఉన్నారు. ఈ రెంటిది మధ్య ఉన్న తేడానే సినిమాల్లో దర్శకుడు చక్కగా చూపాడు. ఆ క్రమంలో కాస్త శృంగారం పాళ్ళు ఎక్కువగానే చూపించాడు.
ఈ పాత్రలో అల్లు శిరీష్ ఒదిగిపోయాడు. అమాయకత్వం, సంప్రదాయం తన ఆహార్యంలో చూపించాడు. ఇప్పటి ఫాస్ట్ అమ్మాయిగా అను ఇమిడిపోయింది. రొమాన్స్ సన్నివేశాల్లో బాగా అమరారు. మిగిలిన పాత్రలు కథ పరంగా బాగున్నాయి. మేనమామయ్యగా సునీల్ పాత్ర, ఆఫీస్ కొలీగుగా వెన్నెల కిషోర్ చక్కగా ఎంటర్టైన్ చేశారు. ఒక మామూలు కథను ఎక్కడా బోర్ కొట్టని విధంగా ఎంటర్టైనింగ్ గా నరేట్ చేయడంతో ఇందులో టైంపాస్ వినోదానికి ఢోకా లేకపోయింది.
ఈ సినిమా . 'ప్యార్ ప్రేమ కాదల్' అనే మూవీకి రీమేక్ గా ఉంది. యువతకు నచ్చే విధంగా సినిమా తీశారు. దాంతో కాస్త రొమాన్స్ బాగా చూపించాల్సి వచ్చింది. హీరోయిన్ మెడికల్ షాప్ సీన్ పలు సినిమాల్లో వచ్చింది. గీతా ఆర్ట్స్ లో ఈ తరహా కథను, వారి హీరోతో చేయడం అభినందనీయం.
సాంగ్స్ బాగున్నాయి.. అచ్చు రాజమణి-అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అలరించింది. కెమెరా పనితనం బాగుంది. దర్శకుడు తాను చేప్పాలిసింది కరెక్ట్ గా చెప్పాడు. ఫైనల్గా సహజీవనం, పెళ్లి ఏది బెటర్ అనేదే బాగా తెలియజేశాడు. అది సినిమా చూస్తేనే బాగుంటుంది. అడల్ట్ డోస్ ఎక్కువ కావడం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమాకు దూరం చేయొచ్చు. యూత్ కు మాత్రం 'ఊర్వశివో రాక్షసివో' బాగానే ఎక్కేస్తుంది.
దర్శకుడు రాకేశ్ శశి రీమేక్ మూవీని బాగా డీల్ చేశాడు. తమిళంతో పోలిస్తే సినిమా తెలుగులో మరింత వినోదాత్మకంగా అనిపిస్తుంది. యూత్ ను టార్గెట్ చేసే క్రమంలో రొమాన్స్ భాగం నిడివి తగ్గించి ఎంటెర్టైమ్నెట్ కాస్త పెంచితే మరింత బాగుండేది. యూత్, కొత్తగా పెళ్లిఅయిన జంటలు బాగా ఎంజాయ్ చేస్తారు.
రేటింగ్; 3/5