గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2022 (11:16 IST)

సైకాలజికల్ థ్రిల్లర్ క‌థ‌లంటే చాలా ఇష్టం, సన్నీ లియోన్

Sunny Leone
Sunny Leone
హీరో మంచు విష్ణు, సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌ నటీ నటులుగా ఈషాన్ సూర్య హెల్మ్ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై నిర్మిస్తున్న కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ " చిత్రం "జిన్నా". ఈ చిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లేను అందించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించ‌గా ప్రేమ్ రక్షిత్ మాస్ట‌ర్ డ్యాన్స్ కొరియోగ్రాఫీ చేశారు. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫర్ గా చేసిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని తెలుగు తమిళం, మలయాళం, హిందీ వంటి నాలుగు భాషల్లో ఈ నెల 21 న గ్రాండ్ గా విడుదలవుతున్న సందర్బంగా ఈ సన్నీ లియోన్ ప‌లు విష‌యాల‌ను మీడియాతో పంచుకున్నారు.
 
- తెలుగులో పూర్తి స్థాయిలో న‌టిస్తున్న  నా మొదటి చిత్రం జిన్నా. లాక్ డౌన్ టైమ్ లో నాకీ కథ చెప్పారు.మెహన్ బాబు గారి ప్రొడక్షన్ హౌస్ లో మంచు విష్ణు తో నటిస్తున్న మొట్ట మొదటి సైకాలజికల్ థ్రిల్లర్. ఇలాంటి కథలు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈ కథ నచ్చి సినిమా చేస్తున్నాను.
 
- ఇందులో నేను రేణుక గా డెఫ్ & డమ్ పాత్రలో ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తున్నాను. ఈ సినిమాలో మంచి స్టార్ క్యాస్ట్ తో పాటు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇందులో ఉంటాయి.
 
- మేము కొన్ని ఫన్నీ, ఫ్రాంక్ వీడియోస్ చేశాము. అవి స‌న్నీ రీల్స్, విష్ణు, ఆయ‌న బృందంతో నేను విడుదల చేసిన ఓ చమత్కారమైన రీల్స్ కు సోషల్ మీడియాలో ప్రేక్ష‌కుల‌నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సోషల్  మీడియా లో వచ్చే నెగిటివ్ కామెంట్స్ ను రీడ్ చెయ్యను. పాజిటివ్ కామెంట్స్ ను తీసుకొని గ్రో అప్ అవుతాను . అయితే ఇలాంటి ప్రాబ్లెమ్స్ నా ఒక్కరికే కాకుండా ప్రతి ఒక్కరికీ  వస్తాయి.
 
- విష్ణు చాలా ఎనర్జీటిక్ పర్సన్ తన యాక్టింగ్ చేయడం చాలా కంఫర్ట్ గా ఉంది. అలాగే పాయల్ తో యాక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది.ముఖ్యంగా హైదరాబాద్  బిర్యానీ రుచి చూశాను చాలా బాగుంది. ఇక్కడి ప్రేక్షకులు చక్కటి అభిమానం చూపుతారు.అలాగే నాకు .హైదరాబాద్, కొచ్చి, చెన్నయ్ ఇలా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ తో నాకు చాలా క్లోజ్ నెస్ పెరిగింది.
 
- ఇక్కడ నాకు విష్ణు ఫ్యామిలీ చక్కటి హస్పిటాలిటీ  కల్పించారు.దర్శకుడు సూర్య  నాకు చక్కటి ట్రాన్స్ లేట్ చేసుకొని  తనకు ఏది కావాలో అది నా దగ్గర చక్కటి నటనను రాబట్టుకుంటాడు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ సినిమాలు చేసినా ప్రతి టీం డిఫరెంట్ వే  లో వర్క్ చేస్తారు.
 
- ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్స్  రెడీ గా ఉన్నాయి. అవన్నీ కుడా డిఫరెంట్ ప్రాజెక్ట్స్. చాలా క్యూరియాసిటీ గా ఉంది అలాగే   డి గ్లామర్ రోల్ లో అనురాగ్ కష్యప్ తో హిందీలో  ఒక సినిమా చేస్తున్నాను. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న "జిన్నా" చిత్రం మాత్రం ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని ముగించారు.