శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2022 (11:41 IST)

వెన్నెల కిషోర్ కు చాలా పొగరు.. మంచు విష్ణు

Vennela Kishore
సినీ హీరో మంచు విష్ణు వెన్నెల కిషోర్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిన్నాలో మీ బెస్ట్ ఫ్రెండ్ వెన్నెల కిషోర్ మరి కొందరు కమెడియన్లు ఉన్నారు కదా అనే ప్రశ్నకు విష్ణు స్పందిస్తూ అతను నా బెస్ట్ ఫ్రెండ్ కానే కాదని అన్నారు. వెన్నెల కిషోర్ కు చాలా పొగరు అని అతనంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అని విష్ణు చెప్పుకొచ్చారు. 
 
వెన్నెల కిషోర్ నన్ను మాట్లాడనివ్వకుండా నాపై కౌంటర్లు వేస్తాడని మంచు విష్ణు వెల్లడించారు. ఈ రీజన్ వల్లే నాకు అతనంటే ఏ మాత్రం ఇష్టం ఉండదని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. వెన్నెల కిషోర్ కు చనువు ఇచ్చేది ఏమీ లేదని అతను పెక్యులర్ క్యారెక్టర్ అని మంచు విష్ణు కామెంట్లు చేశారు. 
 
వెన్నెల కిషోర్ చనువు తీసేసుకుంటాడని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. వెన్నెల కిషోర్ నాకు అస్సలు నచ్చడు అని మంచు విష్ణు అన్నారు. ఆ తర్వాత మంచు విష్ణు ఇదంతా జోక్ అని అన్నారు.