సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2022 (16:58 IST)

క్రేజ్‌తో నిమిత్తం లేదు.. అదృష్టం కావాలి : కేతిక శర్మ

kethika sharma
యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్నంత మాత్రాన ఫలితం లేదని ఆవ గింజంత అదృష్టం కూడా ఉండాలని గ్లామరస్ హీరోయిన్ కేతిక శర్మ అంటున్నారు. ఇటీవలికాలంలో తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్లలో కేతిక శర్మ ఒకరు. పూరి జగన్నాథ్ బ్యానరులో వచ్చిన రొమాంటిక్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ పోస్టరుతోనే కుర్ర మనస్సులో కుంపట్లు రాజేసింది. తన అభిమానుల జాబితాలో చేర్చుకుంది.
kethika sharma
 
ఇక ఇపుడు ఆమె అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. అవకాశం రావాలి. దాని వెనుకే సక్సెస్ కూడా రావాలి. ఈ రెండూ రావాలంటే అందుకు తగిన అదృష్టం ఉండాలి. తనని తప్పించుకుని తిరుగుతున్న అదృష్టాన్ని వెతికి పట్టుకునే పనిలోనే ఆమె ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే తన లేటెస్ట్ పిక్స్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. కేతిక అందాల గని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఓ హిట్టుతో ఆ దిష్టి తీయించుకోవాలని తహతహలాడుతోంది.