గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2022 (16:46 IST)

మినర్వా కాఫీ షాప్ ని ప్రారంభించిన నమ్రతా శిరోద్కర్

namrata launch minarva
namrata launch minarva
ఆసియన్ గ్రూప్ నుండి మినర్వా కాఫీ షాప్, నమ్రతా శిరోద్కర్  జాయింట్ వెంచర్ AN రెస్టారెంట్లు ఈ రోజు ప్రారంభించారు. నమ్రతా శిరోద్కర్ జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టారు.  ఇటీవల వెల్లడించినట్లుగా, స్టార్ కపుల్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ రెస్టారెంట్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నారు. నిన్న ‘AN రెస్టారెంట్లు’- మినర్వా కాఫీ షాప్ యొక్క పూజా కార్యక్రమం జరిగింది. వారు రెస్టారెంట్ వ్యాపారం కోసం ఆసియా గ్రూప్‌కు చెందిన సునీల్ నారంగ్, భరత్ నారంగ్‌లతో కలిసి పని చేస్తున్నారు. నమ్రత పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
Minerva Coffee Shop
Minerva Coffee Shop
'AN (ఆసియన్, నమ్రతా) రెస్టారెంట్లు'- మినర్వా కాఫీ షాప్ ఈరోజు గ్రాండ్ లాంచింగ్ వేడుక ఆరంభమైంది. ఈరోజు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని  మినర్వా కాఫీ షాప్ ప్రారంభమైంది. 'AN రెస్టారెంట్ హైదరాబాద్ అని  నమ్రతా శిరోద్కర్ ఫోటో షేరింగ్ అప్లికేషన్ Instagramలో షేర్ చేసారు. రానున్న రోజుల్లో నగరవ్యాప్తంగా మరిన్ని బ్రాంచ్‌లతో ఈ హోటల్‌ను విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు.