గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2022 (14:57 IST)

మహేష్ బాబు సినిమాలో ఐటమ్ గర్ల్‌గా రష్మిక మందన

Rashmika Mandanna
టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన ఐటమ్ గర్ల్‌గా మారనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో రష్మిక ఐటమ్ సాంగ్ చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ సరసన రష్మిక సరిలేరు నీకెవ్వరు సినిమాలో చేశారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఐటెం సాంగ్ కోసం రష్మిక తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
 
త్రివిక్రమ్ ఇప్పటివరకు తీసిన సినిమాల్లో ఇంత వరకు ఐటమ్ సాంగ్ తీయలేదు. తొలిసారిగా రష్మికతో తన సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇకపోతే.. శ్రియ నుంచి సమంత వరకు ఎంతో మంది స్టార్ హీరోయిన్లు ఐటెం సాంగ్స్‌లో తళుక్కున మెరిశారు. తాజాగా రష్మిక మందన్న కూడా ఈ జాబితాలో చేరింది.