మా నాన్న చాలా ఇచ్చారు.. రుణపడివుంటాం : హీరో మహేష్ బాబు
ఇటీవల మృతి చెందిన సూపర్ స్టార్ కృష్ణ దశదిన కర్మ ఆదివారం జరిగింది. ఈ వేడుకలను ఆయన తనయుడు, హీరో సూపర్ స్టార్ మహేష్, ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు. మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత, సోదరీ మంజుల, హీరో సుధీర్ బాబు తదితరులు కృష్ణ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు తన తండ్రి గురించి ఓ భావోద్వేగంతో మాట్లాడారు.
తన తండ్రి తనకు చాలా ఇచ్చారని, ఆయనకు రుణపడి వుంటామన్నారు. "నాన్న ఎల్లపుడూ మన గుండెల్లోనే, మన మధ్యే ఉంటారు. మీ రందరూ ఇక్కడకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అభిమానం, ఆశీస్సులు నాపై ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని పేర్కొన్నారు.