తండ్రి అస్థికలను కృష్ణానదిలో కలిపిన హీరో మహేష్ బాబు
ఇటీవల కన్నుమూసిన తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను కృష్ణానదిలో కలిపారు. ఇందుకోసం ఆయన తనయుడు, స్టార్ హీరో మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడకు వచ్చారు.
మహేష్ బాబుతో కలిసి విజయవాడకు వచ్చిన వారిలో కృష్ణ సోదరుడు జి.ఆదిశేషగిరి రావు, టీడీపీ ఎంపీ, సీనియర్ నేత గల్లా జయదేవ్, హీరో సుధీర్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
వీరంతా హైదరాబాద్ నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. అక్కడ నుంచి కృష్ణా ఘాట్‍కు చేరుకుని కృష్ణ అస్థికలను ప్రత్యేక పూజల అనంతరం అందులో కలిపారు. ఆ తర్వాత వీరు తిరిగి హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. మహేష్ బాబు రాక నేపథ్యంలో కృష్ణా ఘాట్ వద్ద గట్టి పోలీస్ బందోబస్తును కల్పించారు.